Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : అక్టోబర్ 14వ తేది (నేడు) సోమవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలల కు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు నేడు అక్టోబర్ 14న ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తూ, ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు.
Reporter
Famous TV