Famous TV - విద్య ఉద్యోగాలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పున్నయ్య కమిషన్ సిఫార్సుల మేరకు అంటరానితనం నిర్మూలన, దళిత గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు ఎదురు కుంటున్న అమానుష ఘటనలకు తావు లేకుండా వారికి, విద్యవ్యవస్థలో అధిక ప్రాధాన్యతకల్పించే దిశగా అవగాహన, మరియు శుభ్రత, తాగునీటి సౌకర్యాలు, వీధులు, వీధిలైట్లు, మట్టి రోడ్లకు సిసి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, స్మశానం వాటికలు, వివక్ష కు కారణమైన, సంప్రదాయాలు, విడిపించి, అంటరానితనం బంధకాల నుండి, బానిస బ్రతుకులకు గురికాకుండా, గ్రామములో పెత్తందారీ తనం, ఆగ్రహ సన్నివేశాలకు లోను కాకుండా, ప్రజలకు పరిరక్షణ కల్పించే దిశగా సంబంధిత అధికారులు స్పందించి విజిలెన్స్ మరియు మానిటరీ కమిటీ మీటింగ్లు, ప్రతి నెల నిర్వహించాల్సి ఉండగా ఆ ఊసే లేని కారణంగా ప్రజాసంఘాలు నాయకులు స్పందించారు. ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి... అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజినల్ పరిధి లో గల చౌడేపల్లి మండలం లో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మారిటింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం లేదు,మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధి లో గల చౌడేపల్లి తాహాశిల్దార్ ఈ సమావేశాన్ని ఏర్పాటుకు ఎందుకు ఏర్పాటు చేయలేదని,ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కార దిశగా, ఆ వైపు తీసుకువెళ్లాలని సూచించారు,మదనపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి మండలాలలో దళిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.అంటరానితనం ప్రాలదోలి,సమానత్వం పెంచే,స్వతంత్ర ప్రతిపత్తిని సాధించేందుకు,అవకాశమున్న ఈ ఎస్సీ ఎస్టీ మానిటరి కమిటీ మరియు విజిలెన్స్ కమిటీ సమావేశాలను నిర్వహించడంలో జిల్లాస్థాయి అధికారుల మరియు డివిజన్ స్థాయి అధికారుల,మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యం దాగి ఉన్నట్లు తెలుస్తోంది, పున్నయ్య కమిషన్ సిఫారసులు మేరకు ప్రతి నెలలో విజిలెన్స్ మరియు మానిటరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని చెబుతున్నప్పటికీ నేడు సంబంధిత శాఖ అధికారులకు గుర్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మద్య కాలంలో లద్దిగం గ్రామంలో దళిత నాయకుడు ముష్ఠూరు మునస్వామి పైన దాడి జరిగితే పోలీసులు సరిగా పట్టించుకోలేదు. సమస్య పైన స్పందన లేదు.అంతే కాకుండా దళిత నాయకుడి పైన దాడి జరిగినదని మాలమహానాడు ఆద్వర్యంలో రోడ్డు పైన దర్నా చేస్తున్నారని రాజేంద్ర అనే వ్యక్తి ని కాలర్ పట్టుకొని ఎస్సై ఈడ్చుకొచ్చిన సందర్బం జరిగినది. దళితుల భూసమస్యలు ఎన్నో ఉన్నాఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. నూతన కమిటి సభ్యులు లేక తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.అంతే కాకుండా గోసల కురప్పల్లిలో ఎస్సిల భూమి కోర్టు పరిధిలో ఉండగా రెవిన్యూ అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు.ఐతే గ్రామస్తులు బోర్డు పీకేసి అక్కడ నిర్మాణాలు చేపట్టి, కోర్టు ధిక్కరణ చేస్తే ఎళరికి విన్నవించుకోవాలో తెలియడం లేదు.అంతెందుకు ఎస్సి యువతి బిసి అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకొని, ఇద్దరు బిడ్డల తల్లి ని అత్త, తోడికోడలు,మర్థి, తోడి కోడలు తల్లిదండ్రులు కులం పేరుతో ధూషిస్తే పోలీసులు న్యాయం చేయలేక పోయారు. వచ్చిన పెద్దమనుషులను సైతం వారు నోటికొచ్చినట్ల మాట్లాడినారు.వీటికన్నింటికి పరిష్కారం కావాలంటే మానిటరీ సమావేశం ఏర్పాటు చేయాల్సివుంది.మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తాహాశిల్దార్ అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశాలు కొనసాగింపులో,అధికారులు ముందుకు రాకపోవడం,దళితవాడల్లో జరపాల్సిన ఈ సమావేశాలను,దూరం చేయడమే అవుతుందని ఈ సమావేశాలు నిర్వహించకపోవడం విచారకరమని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండల పరిధిలో దళిత గ్రామాల్లో మానరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని,జిల్లా మారడంతో నూతన కమిటీ,సభ్యుల నియామకం జరగాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Admin
Famous TV