Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : స్పందన (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో ప్రజల సమస్యలకు మొదటి ప్రాధాన్యత , త్వరితగతిన పరిష్కారం. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర రావు ఐపిఎస్ గారు 'స్పందన' కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి "67" పిర్యాదులను స్వీకరించారు.జిల్లా ఎస్పీ గారు ప్రజల సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరి కేసు విషయాలను కూలంకుశంగా అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని,ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబం కలహాలు, ఆర్థిక పరమైన నేరాలు, ఆస్తి తగాదాలు మరియు ఇతరత్రా కారణాలతో పిర్యాదులు అందాయి.ఈ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన “67” మంది వారి సమస్యలను "స్పందన" ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదు లన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ గారు తెలిపారు.
Admin
Famous TV