Famous TV - ఆంధ్రప్రదేశ్ / పల్నాడు ( నరసరావుపేట ) : బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆంజనేయ స్వామి ఆలయంలో మేనిఫెస్టో పత్రాలకు ప్రత్యేక పూజలు,అనంతరం మేనిఫెస్టో ప్రతులతో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లిన డా౹౹చదలవాడ అరవింద బాబు ఇంటింటికి తెలుగుదేశం, ప్రతి ఇంటా సంక్షేమం పేదల సంక్షేమ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో మహానాడు వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో ప్రచారానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ శ్రేణులతో కలిసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి,బాలకృష్ణ జన్మదినం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకు కట్ చేసి నందమూరి బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి తెలుగుదేశం మేనిఫెస్టో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇంటింటికి తెలుగుదేశం,ప్రతి ఇంట సంక్షేమం అనే నినాదాలతో టీడీపీ కార్యకర్తలు,యువకులు డా౹౹చదలవాడ అరవింద బాబుతో కలిసి టీడీపీ మేనిఫెస్టో ప్రతులను ప్రజలకు పంచి పెట్టారు.పేదల సంక్షేమం,అభివృద్ది టీడీపీతోనే సాధ్యమని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.ఈ సంధర్బంగా "5 కోట్ల ఆంధ్రుల "భవిష్యత్తుకు గ్యారెంటీ" ఇస్తూ...తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు ప్రజలకు వివరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మినీ మేనిఫెస్టో మహిళలను,యువతను వెనకబడిన వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంటుందని ప్రతి మహిళకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ,ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం,తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ఏడాదికి 15 వేల రూపాయలు,18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క మహిళకు నెలకు 1500 రూపాయలు,యువతకు 25 లక్షల ఉద్యోగాలు,వెనుకబడిన వర్గాల రక్షణకు ప్రత్యేక చట్టం సమాజంలో గొప్ప మార్పులకు నాంది పలకబోతుందని డా౹౹చదలవాడ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు,నల్లపాటి రాము,పూదోట సునీల్,కొల్లి బ్రహ్మయ్య,కొట్ట కిరణ్,బండారుపల్లి విశ్వేశ్వరరావు,బండారుపల్లి సత్యనారాయణ,మన్నన్ షరీఫ్,మక్కెన ఆంజనేయులు,దండ శివరామకృష్ణ,వసంత ఎల్లమంద,అబ్బూరి శ్రీనివాసరావు,కుమ్మేత కోటి రెడ్డి,అత్తులూరి సుబ్బారావు,చింతిరాల బాలు,గిద్దల వెంకటేశ్వర్లు, దాసరి ఉదయ్ శ్రీ,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Famous TV