Tuesday, 27 October 2026 03:13:07 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

Date : 22 June 2026 08:35 PM Views : 831

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : మదనపల్లి, జూన్ 22: అన్నమయ్య జిల్లా సదుం పోలీస్ స్టేషన్ పరిధిలో 2014లో నమోదైన మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సోమవారం (22.06.2026) తీర్పు వెలువరించింది. చిత్తూరులోని ఇన్‌ఛార్జి పోక్సో కోర్టు జిల్లా జడ్జి అరుణ సారిక ఈ కేసును విచారించి నిందితుడికి జైలు శిక్షతో పాటు అదనంగా రూ.16,000 జరిమానా కూడా విధించారు. సదుం మండలం చింతమాకులపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని గురికానివారిపల్లెకు చెందిన 17 సంవత్సరాల బాలిక, 2014 మే 24న టీటీసీ కోచింగ్‌కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమైంది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదుం పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా (క్రైం నెం.58/2014) నమోదు చేశారు. తదుపరి విచారణలో మరియు బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. గుట్టమీదపల్లి గ్రామానికి చెందిన వగళ్ళ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ బాలికను మోసపూరితంగా తన ఆటోలో ఎక్కించుకుని అపహరించాడు. అనంతరం ఆమెను అక్రమంగా నిర్బంధించి, బెదిరింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 366(ఏ), 376, 342 తో పాటు పోక్సో చట్టం సెక్షన్ 3 రెడ్ విత్ 4 లను అదనంగా చేర్చి దర్యాప్తును వేగవంతం చేశారు. 2014 జూన్ 8న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన దర్యాప్తు అధికారులు, విచారణ పూర్తి చేసి అదే ఏడాది నవంబర్ 28న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.చిత్తూరులోని గౌరవ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం (POCSO S.C. No.52/2014) ఈ కేసును విచారణకు స్వీకరించింది.ప్రాసిక్యూషన్ సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి నేడు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. గతంలో కేసు నమోదు చేసిన పోలీసు అధికారులను, ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా కేసును విజయవంతంగా నడిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వి . మోహనకుమారి,మదనపల్లి డీఎస్పీ బి. పావని, పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్, సదుం ఎస్ఐ విష్ణు నారాయణ, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, కోర్టు కానిస్టేబుల్ తో పాటు విచారణకు సహకరించిన బాధితురాలు, సాక్షులను అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఒక బలమైన సందేశాన్నిచ్చారు."మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.ఇలాంటి అమానుషాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.నేరస్తులు ఎంతటి వారైనా సరే వారిని చట్టం ముందు నిలబెట్టి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చేయడంలో పోలీసు వ్యవస్థ నిరంతరం శ్రమిస్తుంది. ఈ పదేళ్ల జైలు శిక్ష తీర్పు సమాజంలో నేరాలకు పాల్పడేవారికి ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటిది.భవిష్యత్తులోనూ మహిళా సంరక్షణే ధ్యేయంగా,నిందితులకు కఠిన శిక్షలు పడేలా పోలీస్ శాఖ రాజీలేని పోరాటం చేస్తుంది" అని ఆయన స్పష్టం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: