Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ; చిత్తూరు జిల్లా, చౌడేపల్లి పున్నయ్య కమిషన్ సిఫార్సుల మేరకు అంటరానితనం నిర్మూలన, దళిత గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలు ఎదురు కుంటున్న అమానుష ఘటనలకు తావు లేకుండా వారికి, విద్యవ్యవస్థలో అధిక ప్రాధాన్యతకల్పించే దిశగా అవగాహన, మరియు శుభ్రత, తాగునీటి సౌకర్యాలు, వీధులు, వీధిలైట్లు, మట్టి రోడ్లకు సిసి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, స్మశానం వాటికలు, వివక్ష కు కారణమైన, సంప్రదాయాలు, విడిపించి, అంటరానితనం బంధకాల నుండి, బానిస బ్రతుకులకు గురికాకుండా, గ్రామములో పెత్తందారీ తనం, ఆగ్రహ సన్నివేశాలకు లోను కాకుండా, ప్రజలకు పరిరక్షణ కల్పించే దిశగా సంబంధిత అధికారులు స్పందించి విజిలెన్స్ మరియు మానిటరీ కమిటీ మీటింగ్లు, ప్రతి నెల నిర్వహించాల్సి ఉండగా ఆ ఊసే లేని కారణంగా ప్రజాసంఘాలు నాయకులు బుదవారం డిప్యూటీ తాహాశిల్దార్ నందిని ని కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలం లో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మారిటింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం లేదని ,పలమనేరు రెవిన్యూ డివిజన్ పరిధి లో గల చౌడేపల్లి తాహాశిల్దార్లు ఈ సమావేశాన్ని ఏర్పాటుకు ఎందుకు ఏర్పాటు చేయలేదని,ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కార దిశగా, ఆ వైపు తీసుకువెళ్లాలని, పలమనేరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి మండలాలలో దళిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటరానితనం ప్రాలదోలి, సమానత్వం పెంచే, స్వతంత్ర ప్రతిపత్తిని సాధించేందుకు, అవకాశమున్న ఈ ఎస్సీ ఎస్టీ మానిటరి కమిటీ మరియు విజిలెన్స్ కమిటీ సమావేశాలను నిర్వహించడంలో జిల్లాస్థాయి అధికారుల మరియు డివిజన్ స్థాయి అధికారుల,మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యం దాగి ఉన్నట్లు తెలుస్తోందని, పున్నయ్య కమిషన్ సిఫారసులు మేరకు ప్రతి నెలలో విజిలెన్స్ మరియు మానిటరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని చెబుతున్నప్పటికీ నేడు సంబంధిత శాఖ అధికారులకు గుర్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తాహాశిల్దార్ అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశాలు కొనసాగింపులో, అధికారులు ముందుకు రాకపోవడం, దళితవాడల్లో జరపాల్సిన ఈ సమావేశాలను, దూరం చేయడమే అవుతుందని ఈ సమావేశాలు నిర్వహించకపోవడం విచారకరమని, నూతన తాహాశిల్దార్ గనుక ఈ జస్టీస్ పున్నయ్య కమీషన్ సిఫార్సులు అమలు చేయకపోతే ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకొని వెళ్తామని వారు అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పేరుకు పోయిన యస్సి ,యస్టి సమస్యలు ఒక పరిష్కారానికి వస్తాయని దళిత నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వం లో యస్సి,యస్టి ల పైన దాడులు,బినామి కేసులు,భూ ఆక్రమణలు,భూసమస్యలు అధికముగా ఉన్నాయని,ఈ ప్రభుత్వం అమలు చేస్తుందేమో అని యస్సి,యస్టి సంఘనాయకులు ఎదురుచూస్తున్నారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు రెడ్డెప్ప, కృష్ణమూర్తి, బస్టాండ్ శేఖర్, ఉత్తరాది హరిప్రసాద్, గంగాధర, చెంగల్రాయలు, కూరపర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV