Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : మాజీ ఎమ్మెల్యే కుమారుల మధ్య ఆస్తి వ్యవహారం చిచ్చురేపింది. కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మనస్తాపంతో చిన్న కుమారుడు శంకరప్ప ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అడ్డుకుని ఒంటిపై నీళ్లు పోశారు. ఆస్తి విషయంలో అన్నతో తమ్ముడికి వివాదం. ఈ ఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన శంకరప్ప కుమారుడు.చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఆస్తి వ్యవహారంపై వివాదంరేగింది. తన అన్న ఆస్తి పంచడం లేదని మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలంరేపింది. పుంగనూరు తూర్పుమొగశాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే నంజప్పకు వెంకటరత్నం, శంకరప్పలు కుమారులు.
Admin
Famous TV