Thursday, 30 July 2026 04:45:08 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బోయకొండగంగమ్మ ను దర్శించుకొని, చౌడేపల్లి పర్యటన చేసిన --రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డా.షేక్ రోకేయా బేగం

Date : 04 November 2025 07:19 PM Views : 543

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు నవంబరు 04 ఫేమస్ టీవి న్యూస్ : రాష్ట్ర మహిళలకు అండగా మహిళా కమిషన్ పనిచేస్తుంది అనిరాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డా. షేక్ రోకేయా బేగం పేర్కొన్నారు.చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం బోయకొండ గంగమ్మ ను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డా.షేక్ రోకేయా బేగం దర్శించుకున్నారు.అనంతరం చౌడేపల్లి మండలం, ఆమినిగుంట లోని అంగన్వాడీ సెంటర్ ను సందర్శించారు.సదరు అంగన్వాడీ సెంటర్ పై పిర్యాదులు వౄల్లువెత్తాయని, కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకోవాలని, ఈ సమస్య పై ప్రాజెక్టు డైరెక్టర్ కు, కలెక్టర్ కు తెలియజేసి చర్యలు తీసుకోవాలని ఆవిడ ఆదేశించారు. అనంతరం బూరగపల్లి లో గల అంగన్వాడీ సెంటర్ ను సందర్శించారు. అనంతరం చౌడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం చౌడేపల్లి పోలీస్టేషన్ ను సందర్శించి,పోక్సో కేసులపైన విచారణ చేశారు. అలాగె బాల్యవివాహాల పై అవగాహన కల్పించాలని,బాల్యవివాహాలు నిలుపుదల చేయాలంటే అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులు, మీడియా, ఐసిడియస్ సంయుక్త సహాకారాలతో అడ్డుకట్ట వేయవచ్చునని, ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే వాళ్ళ పై పోక్సో కేసులు నమోదుచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐ సి డి ఎస్ పి డి వెంకటేశ్వరి, సిడిపిఒ రాజేశ్వరి, సి ఐ రాం భూపాల్, ఎస్సై నాగేశ్వరావు, ట్రైనీ ఎస్సై మణికంఠేశ్వర్ రెడ్డి, సూపర్ వైజర్లు సులోచనా,రాథ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ మహిళా కమిషన్ చిత్తూరు లోని సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన దారుణ ఘటన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, విద్యార్థుల శ్రేయస్సు ప్రతి విద్యా సంస్థలో నిర్ధారించబడేలా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూసేందుకు కృషి చేస్తామని తెలిపారు.సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన దారుణ ఘటనలో ఈ కళాశాలలో ఎన్.నందినీ రెడ్డి బి.టెక్ (ఇసిఇ), మూడవ సంవత్సరానికి చెందిన విద్యార్థిని ల్యాబ్ పరీక్షకు రికార్డులు సబ్మిట్ చేయలేదని అడగగా నేను నా కుటుంబ సభ్యులతో చెన్నైకి వెళ్లి రావడం జరిగినదని తెలుపగా అందుకు ల్యాబ్ పరీక్షకు అనుమతి ఇవ్వకపోవడం,ఆత్మహత్యాయత్నం ఘటన పై విచారణ కార్యక్రమానికి రావడం జరిగిందని తెలిపారు.ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిత్తూరులోని సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించి, ఘటనకు దారితీసిన వాస్తవ పరిస్థితులను పరిశీలించి కళాశాల నిర్వహణ, అధ్యాపకులు, సంబంధిత సిబ్బందితో మాట్లాడి, విద్యార్థి పై వారి ప్రవర్తన మరియు వ్యవహార తీరును ఘటనకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించి నివేదికలను కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఒక మైనర్ బాలిక తల్లి కావడం పై తల్లిదండ్రులు తో చర్చించి,కేసుపూర్వాపరాలు పరిశీలించారు.ఈ కేసువిషయమై సి ఐ రాంభూపాల్ ను వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ సదరు మైనర్ బాలిక విషయం పై కేసునమోదు చేసి, అతడ్ని రిమాండుకు పంపడమైనదని, ఈ సంఘటన లో ముఖ్యంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలనే జరిగిందని,తండ్రి అనునిత్యం మద్యం మత్తులో ఉండటం, కుటుంబాన్ని పట్టించుకోక పోవడం, తల్లి కూడా బాలికలో వస్తున్న మార్పులను గమనించక పోవడం తర్వాత గ్రామంలో పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించడం అక్కడ వారికి పొత్తులు కుదరక పోలీస్టేషన్ కు రావడం జరిగిందని, అంతే కాకుండా సదరు మైనర్ బాలిక జన్మనిచ్చిన పిల్లవాడికి డియన్ఎ పరీక్షలు చేయించడం ద్వారా అతనే పిల్లవాడికి తండ్రి అని రిపోర్టలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: