Saturday, 13 June 2026 11:05:11 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వేమన విజ్ఞాన కేంద్రం ఘననివాళులు అర్పిస్తోంది.

Date : 14 April 2024 05:11 PM Views : 667

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఈ సందర్భంగా జరిగిన సభలో ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అనేక అవమానాలు, వివక్షతలను ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు.అనేక డిగ్రీలు పొంది ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వం,సమానత్వం, సౌబ్రాతృత్వాన్ని నేడు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. వేమనవిజ్ఞానకేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనం అనే అనాగరిక పోకడలు పోవాలని పోరాడాడు. పశువులు త్రాగే చెరువులో దళితులు నీరుతాగితే మైలపడి పోతాయని అగ్రవర్ణాల వారు అడ్డుకుంటే అందులో నీరుతాగే హక్కు కోసం వేలాదిమందితో మహద్ చెరువు పోరాటం చేపట్టి సాధించారు. అనంతరం నడ్డి నారాయణ గారు మాట్లాడుతూ సమాజం వికసించాలంటే చదువు ప్రధానమని అన్నారు.కార్మికుల, మహిళల హక్కుల కోసం అనేక చట్టాలు తెచ్చాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం మరియు జన విజ్ఞాన వేదిక నాయకులు టెంకాయల దామోదరం,సుంకర రెడ్డప్ప,N.ముని లక్ష్మి, ముఖేష్,SA రఫీ,రవి, జి బాలసుబ్రమణ్యం, ఈ ఎస్ కుమార్, కలకట రెడ్డప్ప, శ్రీనివాసులు, జనార్ధన్, గురు ప్రసాద్, జ్ఞాన ప్రసూన, మోహన్ నాయుడు,S. మునిరాజు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :