Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలోని స్థానిక తిలక్ రోడ్డులో ఎస్.బి.బి సంస్థ వారి మెడికేర్ అను అతి పెద్ద హోల్ సేల్ అండ్ రిటైల్ మెడికల్ స్టోర్ బుధవారం నగర ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న వైద్య విధానంలో మార్పులకు తగ్గట్టుగా సదరు దుకాణాన్ని మంచి ప్రణాళికతో రూపొందించడం ఆనందదాయకమన్నారు. రోగులకు వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన దుకాణ యజమాని కె.వి చౌదరిని అభినందించారు. నాణ్యమైన మందులు నగర ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ రోగులకు సేవలు అందించడంలో వైద్యుల రంగం ఎంత ముఖ్యమో, వారు తీసుకునే మందులు అంతే ముఖ్యమని, అటువంటి మందులు ఈ దుకాణంలో ఏర్పాటు చేయడం హ ర్షదాయకమన్నారు. నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ అందరికీ చేరువలో, అతి తక్కువ ధరలకే ఈ మందుల దుకాణం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ హరిత మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని, సరసమైన ధరలలో నాణ్యమైన అన్ని రకాల మందులను నగర ప్రజలకు అందుబాటులో ఉంచడం శుభ పరిణామం అన్నారు. మెడికేర్ సమస్త చైర్మన్ కె.వి చౌదరి మాట్లాడుతూ తాను ఒక సాధారణ ఇటుక వ్యాపార రంగం నుంచి హోటల్ నిర్వాహకుడిగా, బిల్డర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఇలా పలు రంగాలలో నిత్యం నగర ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని, మొట్టమొదటిసారిగా పేద రోగులకు అతి తక్కువ హోల్సేల్ ధరలలో మందులు అందించేందుకు వైద్యరంగంలో అడుగుపెట్టడం జరిగినదని సంతోషం వ్యక్తం చేశారు. నగర ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా మెడికల్స్, సర్జికల్స్, పర్సనల్ కేర్, మామ్ అండ్ బేబీ కేర్, హెల్త్ కేర్, న్యూట్రిషన్, వెల్నెస్ వంటి అన్ని రకాల మందులు ఒకే చోట ఉపయోగపడే విధంగా ఈ మందుల దుకాణం ఏర్పాటు చేయడమైనదని పేర్కొన్నారు. హోల్ సేల్ ధరలలో 20% డిస్కౌంట్ తో ఫ్రీ హోం డెలివరీ సదుపాయం కూడా తమ దుకాణంలో అందుబాటులో ఉంటుందని, వాట్సప్ ద్వారా డాక్టర్ రాసిన ఉత్తర్వును పెడితే మందులను చేయబడుతుందని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Admin
Famous TV