Tuesday, 27 October 2026 03:53:11 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

పీ డీ ఎస్ యూ రాష్ట్ర రాజకీయ తరగతులను జయప్రదం చేయండి

Date : 30 August 2023 07:23 PM Views : 724

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ------------------------------------ సెప్టెంబర్ 8,9,10 తేదీలలో తిరుపతి నగరంలో జరుగు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ తరగతులను విజయవంతం చేయాలని పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు E .భూషణం కె.భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు పోస్టర్లు విడుదల చేయడం జరిగింది అనంతరం వారిరువురు మాట్లాడుతూ పీ డీ ఎస్ యూ నిర్మాత కామ్రేడ్ జార్జిరెడ్డి జన్మించిన చిత్తూరు జిల్లా కేంద్రంలో తిరుపతి నగరంలో రాష్ట్ర విద్య వైజ్ఞానిక తరగతులు జరుగుతున్నాయని అన్నారు. మొదటిరోజు జార్జిరెడ్డి స్వగ్రామమైన చల్లవారిపల్లె నుండి ఎస్వీ యూనివర్సిటీ వరకు జార్జి రెడ్డి స్మారక బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా జార్జిరెడ్డి సహచరులు ప్రదీప్ గారు, జార్జిరెడ్డి మూవీ హీరో డైరెక్టర్ హాజరైతారని అన్నారు. అదేవిధంగా 9 10 తేదీలలో తిరుపతి నగరంలో రాజకీయ క్లాసులో నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని ఈ విద్యా విధానం ద్వారా విద్య కాషాయీకరణ ప్రైవేటీకరణ చేస్తూ విద్య వ్యవస్థను నాశనం చేయడానికి పూనుకున్నాడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని అమలు చేస్తూ 3,4,5 తరగతులను విలీనం చేయడం ద్వారా 4200 ప్రాథమిక పాఠశాలలో మూసివేశారని అన్నారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ ఉన్న పాఠశాలలు 9602 ఉన్నాయని అన్నారు. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే యూనివర్సిటీలను విదేశీ పరం చేయడం కోసం విదేశీ యూనివర్సిటీలను మన దేశంలో అనుమతిస్తూ యుజిసి చైర్మన్ అయినటువంటి జగదీష్ గారు ఆమోదముద్ర వేశారు విదేశీ యూనివర్సిటీలలు రావడం వలన ప్రభుత్వ యూనివర్సిటీలో విద్య నిర్వీర్యం అవుతుందని తద్వారా విదేశీ యూనివర్సిటీలో ఏ ఒక్క విద్యార్థి చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు అన్నారు విదేశీ యూనివర్సిటీల బిల్లులను వ్యతిరేకించడం జరిగింది. మెడికల్ విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి జీవో నెంబర్ 107,108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించుకోవడం కోసం రాష్ట్ర విద్య వైజ్ఞానిక తరగతులు జరుగుతున్నాయని ఈ తరగతులను జయప్రదం చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు K.ఆదిశేషులు, సహాయ కార్యదర్శి నాని నాయకులు మహేష్ ,కాశీ ప్రసాద్, ధనశేఖర్ మొదలైన వారు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :