Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : బుధవారము ఎస్ వి వైద్య కళాశాల రుయా ఆసుపత్రి కంటి విభాగము నందు గ్లకోమ వారోత్సవాలు మార్చి నెల 10 నుండి మార్చి 16వ తారీకు వరకు గ్లకోమ వ్యాధికి సంబంధించిన అవగాహన మరియు ఉచితముగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్లకోమవ్యాధిగ్రస్తులకు ఉచితముగా చుక్కల మందులు కూడా ఇవ్వబడుచున్నవి. ఈ గ్లకోమ వారోత్సవాలు నాలుగవ రోజైన ఈరోజు ఎస్వీ వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ ప్రారంభిస్తూ డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ గ్లకోమ అనేది కళ్లకు సంబంధించిన వ్యాధి, కంటి లోపల పీడనము పెరిగి కంటి నరాన్ని చచ్చుబడి పోయేటట్లు చేస్తుంద, తద్వారా నెమ్మదిగా కనుచూపు తగ్గిపోతుంది. గ్లకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనబడకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్లకోమ పరీక్షలను చేయించుకోవాలని ఈ సందర్భంగా అందరికి ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు మాట్లాడుతూ గ్లకోమ ను ప్రారంభ దశలోనే కనుగొని నట్లయితే కంటి చూపును మనము కాపాడు కొనవచ్చునని ఆయన అన్నారు. గ్లకోమ వారోత్సవాలు సందర్భంగా గ్లకోమ పరీక్షలు ఎవరు చేయించుకోవాలి : అనే విషయాన్ని ఈ క్రింది విధంగా తెలిపారు. 1) 35 సంవత్సరముల నుండి 40 వయసు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పరీక్షలు చేయించుకోవాలి. 2). ఇంతకు పూర్వం కనుక్రుడ్డుపై గాయం తగిలిన వారు. 3) స్థిరాయిడ్ మందులు అధికంగా వాడిన వారు 4) షుగరు , బి.పి వ్యాధిగ్రస్తులు 5) రక్తసంబంధీకులలో ఎవరైనా గ్లకోమ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరు, పై పరీక్షలు అన్నీ నిర్వహించుకున్నట్లయితే వారి కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకొని ప్రకృతిని, వారి యొక్క కుటుంబాన్ని చాలా ఆనందంగా చూస్తూ కడపగలరని, సమాజాన్ని ముందుకు నడపగలే శక్తి సామర్థ్యము వారి యొక్క కంటి చూపు మీదే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కంటి చూపు వివాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కంటి చూపు అనేది చాలా ముఖ్యము , ఇలాంటి చిన్నచిన్న ఇబ్బందులు కలిగిన వెంటనే కంటి విభాగమునందు వైద్యులను వైద్య సిబ్బందిని, సంప్రదించి ప్రాథమిక దశలోనే వైద్యం తీసుకున్నట్లయితే వారి కంటి చూపు మెరుగుపడుతుందని, ఈ గ్లకోమ వారోత్సవాలు సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఈ రోజే గ్లకోమ పరీక్షలు చేయించుకోండి, మీ కళ్ళను భద్రంగా కాపాడుకోండి, అని ఒక సందేశాన్ని తెలిపారు. మీకు రుయా ఆసుపత్రి కంటి విభాగము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఓపిలో మీ పేరు నమోదు చేసుకొని విభాగాధిపతిని సంప్రదించినట్లయితే, వైద్యం అందించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలందరూ ఈ సదవకాశమును సద్వినియోగం పరుచుకోండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు (పరిపాలన), రుయా ఆసుపత్రి ఏ ఆర్ ఎం ఓ. డాక్టర్ హరికృష్ణ, జిల్లా బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అధికారి డాక్టర్ మధు, అరవింద్ ఆసుపత్రి డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ సాధన, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ లీలావతి, డాక్టర్ జ్ఞాన ప్రసూన, డాక్టర్ శ్రీ లక్ష్మి, డాక్టర్ హిమబిందు డాక్టర్ రామలక్ష్మి, ఎస్ వి వైద్య కళాశాల యూజి,పిజి, వైద్య విద్యార్థులు, అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులు, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ రమేష్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV