Thursday, 30 July 2026 04:33:27 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలు మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లిన రెడ్డి గంగా రాజు.

Date : 05 August 2025 07:03 AM Views : 623

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలు మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లిన రెడ్డి గంగా రాజు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సమస్యలు మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లిన రెడ్డి గంగా రాజు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోరాట కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు గంగాధర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలిసి కాంట్రాక్ట్ నర్సుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి అందించిన వినతిపత్రంలో ముఖ్యంగా ఈ క్రింది అంశాలను పేర్కొన్నారు. తక్కువ జీతాలు మరియు ఆర్థిక ఇబ్బందులు.కాంట్రాక్ట్ నర్సులు ప్రస్తుతం తక్కువ జీతాలతో కుటుంబాలను పోషించడానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 100% గ్రాస్ శాలరీ అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ, అది ఇంకా అమలు కాలేదని, దీనివల్ల నర్సులు చాలా కష్టాలు పడుతున్నారని రెడ్డి గంగా రాజు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే 100% గ్రాస్ శాలరీని అమలు చేయాలని ఆయన కోరారు.బదిలీలు మరియు ఉద్యోగ భద్రత లేకపోవడం.చాలామంది నర్సులు తమ కుటుంబాలకు దూరంగా పనిచేయాల్సి వస్తోందని, దీంతో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ సొంత ప్రాంతాలకు లేదా సమీపంలోని ప్రాంతాలకు బదిలీలను కల్పించాలని కోరారు. అలాగే, చాలా సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నప్పటికీ, వారికి ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ డాక్టర్లను నియమిస్తున్న ప్రభుత్వం, కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయడం లేదని పేర్కొన్నారు. కనీసం మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కఠినమైన పని పరిస్థితులు నర్సులు 12 గంటలు లేదా కొన్ని సందర్భాల్లో 24 గంటల సుదీర్ఘ షిఫ్టులలో పనిచేయాల్సి వస్తోందని గంగాధర్ వివరించారు. భద్రత లేని ప్రాంతాల్లో, ముఖ్యంగా మహిళా నర్సులకు, సింగిల్ డ్యూటీ చేయాల్సి వస్తోందని, ఇది చాలా ప్రమాదకరమని తెలిపారు. సెలవు దినాల్లో కూడా నర్సులు ఒంటరిగా విధులలో ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు.కొన్ని పి హెచ్ సి లలో ఉన్నతాధికారులు నర్సులను మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని పని ప్రదేశాలలో సరైన నీరు, విద్యుత్, మరియు డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని గంగాధర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.సమానత్వం కోసం విజ్ఞప్తి.డీ ఏం ఈ, ఏపీవీవీపీ వంటి వివిధ విభాగాలలో పనిచేసే నర్సులందరికీ ఒకే విధంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్, వన్ టైమ్ ట్రాన్స్ఫర్, లేదా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వంటి బదిలీ సౌకర్యాలను కల్పించాలని రెడ్డి గంగా రాజు మంత్రిని కోరారు.మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: