Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : పాడి రైతులకు మరింత ప్రోత్సాహం అందించి పాలసేకరణ పెంచాలని కో ఆపరేటివ్ కమిషనర్ అహమ్మద్ బాబు అన్నారు. గురువారం రాత్రి స్థానిక కలెక్టరేట్ లో జగనన్న పాల వెల్లువ పై కమిషనర్ కోపరేటివ్ డిపార్ట్ మెంట్ అహమ్మద్ బాబు, జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి తో కలసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు జగనన్న పాల వెల్లువ అని ప్రధానంగా రిజిస్టర్ అయిన పాడి రైతులకు అందరికి రుణ సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తే 4004 కి డిసిసిబి కేవలం 101 మందికి మాత్రమే ఇవ్వడం పై ఆగ్రహించారు. డి ఆర్ డి ఏ వారు 1407 మందికి అందించారు, జిల్లాలో రుణాల రికవరీ 94% గా వుంది, అనేక బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతున్నది అన్నారు. జిల్లా లో మిగిలిన వారికి వెంటనే రుణ సౌకర్యం కల్పించాలని అన్నారు. రైతులకు సహకారం ఇస్తే రైతు అభివృద్ధి చెందుతారని అధికారులు గుర్తు చేసుకోవాలి అన్నారు. ఇతరుల వలలో పడి తెలియక రైతులు నష్టపోతారని అన్నారు. త్వరలో చిత్తూరు డైరీ రూ. 400 కోట్లతో అభివృద్ధి చేసి ప్రారంభించ నున్నారు.
రైతులకు గోల్డెన్ ఛాన్స్ , అధికథరలు చెళ్ళించేది అమూల్ ఒకటే గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం చేయూత పథకం అందిస్తున్నది అవగాహన కల్పించాలి, రైతులు అమాయకులు , అదే ఆసరా చేసుకుని ప్రవేట్ డైరీ వారు ముందుగా అడ్వాన్స్ చెల్లించి మోసం చేస్తున్నారు. నియోజవర్గానికి పశు వైద్య వాహనాలు ( ఆంబులెన్సులు) రెండు వున్నాయి, జగనన్న పాల వెల్లువ గ్రామాలు సందర్శించాలి అన్నారు. జిల్లాలో రెండవ దశ సేకరణ జూలై 1 నుండి 6 మండలాల్లో కనీసం 150 గ్రామాల్లో ప్రారంభించాలి అన్నారు. ప్రస్తుతం మూడు మండలాల్లో 79 కేంద్రాల్లో పాల సేకరణ జరుగుతున్నది, ఇక్కడ కూడా మరింత పాల సేకరణ పెంచాలని అన్నారు. పాలల్లో ఎస్ ఎన్ ఎఫ్, ఫాట్ శాతం పెంచడానికి కార్బో హైడ్రేట్ లు గల గ్రాసం పాడి పశవులకు అందించేలా చూడాలి అన్నారు. ఏ ఎం సి, బి ఎం సి ల్లో రిపేర్లు వస్తె 7396211403 పిర్యాదు చేయాలి వెంటనే పరిష్కరిస్తారు, ఏ ఎం సి యు ల వద్ద ఈ నెంబర్ డిస్ప్లే వుండాలి అన్నారు. వారంలోపు డిసిసిబి లోన్స్ అందించాలి, కొత్త పాడి రైతుల ను చేర్పించాలి అన్నారు. దేశంలోనే మంచి ధరలు పాడి రైతులకు అందుతున్నది అన్నారు. ఈ సమీక్షలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాసుల రెడ్డి, అమూల్ ప్రతినిధి నికుంజ్ , డి ఆర్ డి ఎ పి డి జ్యోతి, పశు సంవర్థక శాఖ అధికారులు, డిసిసిబి అధికారులు పాల్గొన్నారు.
Admin
Famous TV