Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను సోమవారం తిరుపతి విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు మండలంలోని గ్రోమోర్,పుడమి, కిసాన్ మార్ట్ నందు యూరియా స్టాక్ నిలువలను గత రెండు రోజులుగా అమ్మినటువంటి బిల్లును వాటికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు ఆధార్ కార్డులు పరిశీలించారు. 15 నుంచి 20 మంది రైతులను చరవాణి ద్వారా అడిగి తెలుసుకున్నారు. మరల వచ్చే యూరియా నందు ఎటువంటి అవకతవకలు లేకుండా రైతులకు అందజేయాలని వారు సూచించారు.ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు రామాంజనేయ రెడ్డి, గురు ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ పాల్గొన్నారు.
Admin
Famous TV