Wednesday, 29 July 2026 03:11:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు జిల్లాలో రైతులకు ఏర్పడిన యూరియా కొరతను తీర్చాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు గీత

Date : 09 August 2025 07:24 PM Views : 613

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టివి న్యూస్ - జిల్లాలో రైతన్నలకు యూరియా కొరత అధికంగా ఉందని, అసలు యూరియా నిజంగానే కొత్తగా ఉందా, లేదా కృత్రిమంగా కొరతను సృష్టించారా అన్నది జిల్లా వ్యవసాయ అధికారులే తెలపాలని, జిల్లాలో ఏర్పడిన యూరియా కొరతను వెంటనే తీర్చి రైతన్నలకు సహాయంగా నిలవాలని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీత సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా శనివారం ఆవిడ సూర్య (వెలుగు) జాతీయ దినపత్రిక ప్రతినిధితో ఫోన్ లైన్ లో మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ప్రాంతమైన పుంగనూరు నియోజకవర్గంలో రైతులకు ఎంతగానో అవసరమైన యూరియా , రైతులకు సరైన సమయంలో అందక కొరతగా ఉండటం, రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవసరమైన మేర యూరియాను ఏర్పాటు చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని ఆవిడ మండిపడ్డారు.ఇందుకు నిదర్శనంగా నియోజకవర్గాలలోని ఆయా మండలాలలో యూరియా కోసం వేగపడుతున్న రైతన్న లో దృశ్యాలను చూడొచ్చని అన్నారు. అంతేకాకుండా పుంగనూరు నియోజకవర్గం లో చౌడేపల్లి, సోమల మండలాలలో యూరియా కొరత అధికంగా ఉందని, అందులోనూ పుంగనూరు,చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల, రైతులు అధికంగా వరి సాగు చేశారని వారికి అధికమతాదులో యూరియా ఆవశ్యకత ఉంటుందని అన్నారు. కానీ రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో వారు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా యూరియా కొరతను సకాలంలో తీర్చి రైతులకు సరిపడా యూరియాని అందించటానికి వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆవిడ సూచించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :