Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రామిక,కార్మిక కష్ట జీవులంటే నాకు ఎంతో ఇష్టం, ఎనలేని గౌరవం ఉందని టీటీటీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతి పురం లోని ఆయన నివాసంలో గురువారం కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ ను సత్కారించారు. ఆయన మాట్లాడుతూ సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వారికి సేవ చేయడానికి వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. మీకు వేతనాలు పెరగడంలో అండగా నిలబడిన మహానుభావుడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. కార్మికుల వేతనాల గురించి చెప్పగానే మరొక్క మాట కూడా మాట్లాడ కుండా అలాగేనని ఈవో ఆన్నారు. నాకు కొంత ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వండి, మీకు మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. నేనూ అనేక ఉద్యమాలు చేశాను, జైళ్లకు కూడా వెళ్లాను, ఉద్యమాలు చేసినంత సులభంగా ఒక్కోసారి పనులు కావు టీటీడీ అంటేనే ఒక్కడిగా కాదు, అంతా కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మీకు మంచి జరగడం కోసమే అన్ని విధాలా ప్రయత్నిస్తానని మీకు జీతాలు పెరిగినందుకు మీ కంటే ఎక్కువగా సంతోష పడుతున్న వాడిని నేనే అన్నారు.
Admin
Famous TV