Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఆగష్టు 29 ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ,అందరిలో ఒకరిగా ఉంటూ సేవలందించిన తోటి వెంకటేష్ ప్రభుత్వ ముద్రణాలయం విజయవాడ లో తన విధులను నిర్వహించి పదవీ విరమణ పొందిన సందర్భంగా చౌడేపల్లి పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో శనివారం ఘనంగా దుశ్సాలవలతో సన్మానించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ భవనం సభ్యుల సహాయ సహాకారాలతో ముందుకు సాగినది.ఈ కార్యక్రమంలో మండల విద్యశాఖాధికారి కేశవరెడ్డి, మాజీఎంపిపి కూరపర్తి అంజిబాబు, వైకాపా యూవజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ భరత్,ఎంపిటిసి శ్రీరాములు,బత్తలాపురం హరినాథ్, పరికిదొన బాబు, ఆమినిగుంట మాజీ సర్పంచ్ వేణుగోపాల్, డిష్ సూరి, బహుజన సేవా సమితి వ్యవస్థాపకులు గుండ్లూరు కృష్ణమూర్తి,రిటైర్డ్ టీచర్ చిన్నస్వామి, చారాల అమరనారాయణ, బ్యాంకు రమణ, బ్యాంకు రెడ్డెప్ప,కూరపర్తి శ్రీనివాసులు,జాల నాగరాజ, ఇస్సారాము తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV