Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివితే అనంతరం 80 ఏళ్లు సంతోషంగా జీవించొచ్చని విజయ వాణి విద్యాసంస్థల అధినేత నాయుని చంద్రశేఖర మూర్తి అన్నారు. చౌడేపల్లి విజయ వాణి నగర్ లోని విజయ వాణి విద్యాసంస్థల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9,10 తరగతులు మరియు ఇంటర్మీడియట్ లలో నాలుగేళ్లు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే తరువాత జీవిత కాలం సంతోషకర జీవితం గడప వచ్చని, కుటుంబానికి, సమాజానికి ఉపయోగ పడి ఉత్తమ జీవితం గడప వచ్చని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయవాణి విద్యాసంస్థల కరెస్పాండెంట్ నాయుని చంద్రశేఖర మూర్తి విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. అకడమిక్ అడ్వైసర్ పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్తిగా ఉండాలని జీవితమే ఒక పాఠం కావలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురుప్రసాద్ ప్రిన్సిపల్స్ జ్యోతి రాణి, కరుణ, రాధిక ,విజయ వాణి స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉపాద్యాయినిలు విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు.
Admin
Famous TV