Thursday, 30 July 2026 11:04:50 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పతి రాజు సారథ్యంలో రెండవ రోజు ఘనంగా తొలి అడుగు' - ప్రజలనుంచి విశేష స్పందన

Date : 04 July 2025 08:39 PM Views : 682

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి గ్రామపంచాయతీ పరిసర గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో కూటమి ప్రభుత్వ కొత్త కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళుతున్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఏడాది పాలన, సూపర్ 6 అమలుపై ప్రజలకు ప్రత్యక్షంగా వివరణ కరపత్రాలు పంచుతూ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూటమి పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందుతున్నాయని ప్రజల హర్షం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని పండగ వాతావరణంలో ప్రారంభించింది. ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటినీ సందర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న 'సూపర్ 6' హామీల పురోగతిని ప్రజలకు వివరిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు వివరాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడమే కాకుండా, ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు కూడా స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమలులో వివక్షను ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో 'సూపర్ 6' పథకాలు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా అందుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు.ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచడంతో పాటు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా ఈ ప్రచారంలో అవగాహన కల్పించారు. ప్రజా భాగస్వామ్యంతో మార్చే దిశగా ఈ కార్యక్రమంలో లక్ష్మి పతి రాజు, ప్రదీప్ రాజు, సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్,బి.జే.పి.మండలాద్యక్షులు కడియాలు మనోహర్, యువ నాయకుడు కార్తీక్,సాగర్,మంజునాథ్ రెడ్డి,గంగాధర్ రెడ్డి,కుమార్ రెడ్డి,నారాయణ రాజు,నాగరాజ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు నాగరాజ రెడ్డి, బోయకొండ రామకృష్ణ,శివన్న,కొలింపల్లి గణేష్, మల్లికార్జున,శంకర్ రాజు,ప్రహాల్లాద,కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: