Tuesday, 27 October 2026 03:10:20 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు

Date : 24 September 2026 06:54 PM Views : 162

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : చిత్తూరు సెప్టెంబర్ 24 ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటలోని కేవీసీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయని సెంటర్ ఫర్ యాక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉత్తరాది గీత తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్ ఎవరు,ఆయన పాఠశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారా అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు.అలాగే స్కావెంజర్,నైట్ వాచ్‌మెన్ తదితర సిబ్బందితో వంట పనులు కూడా చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.మధ్యాహ్న భోజనానికి కేటాయించే బియ్యంలో ఒక్కో రోజు 5 నుంచి 10 కిలోల వరకు తక్కువగా ఇస్తున్నట్లు వంట సిబ్బంది చెబుతున్నారని ఆమె ఆరోపించారు.నెల చివరిలో ఆ బియ్యం ఎవరు తీసుకొని వెళ్తున్నారు.బియ్యం తరలించడానికే సిసి కెమెరాలు క్రిఃదికి దించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై సంబంధిత అధికారులు సమగ్రంగా తనిఖీ చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణను వివరణ కోరే క్రమంలో ఫోన్ కాల్ రికార్డింగ్ చేసినట్లు,అనంతరం అన్నపూర్ణ భర్త సురేందర్ రెడ్డి బి.కొత్తకోట ప్రాంతం నుంచి కొందరు వ్యక్తులు ఫోన్ చేసి విలేకరులపై బ్లాక్‌మెయిల్ ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం చేశారని ఉత్తరాది గీత ఆరోపించారు. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వివరణ కూడా తీసుకోవాలని ఆమె కోరారు.పాఠశాలలో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా,పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహించిన అనంతరం వంట పనుల్లో పాల్గొంటున్నారా అనే అంశాలపై కూడా అధికారులు విచారణ చేయాలని అన్నారు.సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ఆందోళన,పాఠశాలలో భద్రతా పరంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని,ఇది పాఠశాల విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగించే అంశమని ఉత్తరాది గీత పేర్కొన్నారు.సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదో మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే పరిశీలించి,విచారణ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారి,జిల్లా కలెక్టర్, విద్యాశాఖ కమిషనర్‌కు సమర్పించాలని ఆమె డిమాండ్ చేశారు.మధ్యాహ్న భోజన పథకం అమలు,బియ్యం సరఫరా,సిబ్బంది విధులు, పాఠశాల పారిశుద్ధ్యం,సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని ఉత్తరాది గీత కోరారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :