Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం పై ఇంజనీరింగ్ అధికారులు అక్షయపాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అన్ని హంగులతో స్వీమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలని, ముత్యాల రెడ్డి పల్లి, ఇఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేసామని అన్నారు. అయితే మొదటి దశలో ప్రారంభం కాలేదని, ఈ 18న రెండవ దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయని అన్నారు. ఈ మేరకు నాలుగు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలని అన్నారు. క్యాంటిన్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రజలకు అందించే ఆహారం సరైన సమయంలో ఇచ్చేలా చూడాలని అక్షయపాత్ర నిర్వాహకులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికె అధికారులకు అన్ని విధులు కేటాయించామని అన్నారు. వారందరూ వారికి పనులు సక్రమంగా చేసి, స్వచ్ఛత హి సేవా కార్యక్రమం విజయవంతం చేయాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, డి.ఈ. లు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, రాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు,శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, మెప్మా కృష్ణవేణి, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV