Thursday, 30 July 2026 09:19:17 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులకు ఇక గుడ్ బై.

రవాణాశాఖ సంచలన ప్రకటన.

Date : 21 August 2023 10:16 AM Views : 674

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ లతో పాటు రిజిస్ట్రేషన్ కార్డులు(ఆర్సీలు) జారీని నిలిపేస్తూ ఏపీ రవాణాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాసయినా కార్డుల జారీ మాత్రం ఉండదు. కేవలం యాప్ లలో వాటిని చూసుకోవాల్సిందే. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో లక్షలాది మంది వాహనదారులపై ఈ ప్రభావం పడబోతోంది ఏపీలో ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు యాప్ లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే సరిపోతుందని, కార్డుల జారీ ఇకపై ఉండబోదని రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండేళ్లుగా వీటి కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది వాహన దారులకు క్లారిటీ వచ్చినట్లయింది. ఇకపై రోడ్లపై కూడా పోలీసులు, రవాణా సిబ్బంది వాహనాలు ఆపినప్పుడు ఇలా డౌన్ లోడ్ చేసుకున్న లేదా యాప్ లలో కనిపించే పత్రాలు చూపిస్తే సరిపోతుంది వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది మంది వాహనదారుల దగ్గర లైసెన్స్ కార్డు లేదా ఆర్సీ కార్డు జారీకి రూ.200తో పాటు పోస్టల్ ఛార్జీ రూ.25 కలిపి మొత్తం రూ.225 వసూలు చేస్తోంది. కానీ కొంతకాలంగా వీటిని వసూలు చేయడం ఆపేశారు. అయితే ఇప్పటికే ఇలా ఛార్జీలు వసూలు చేసిన వాహనదారులకు కార్డుల్ని త్వరలో జారీ చేస్తామని రవాణాశాఖ కమిషనర్ తెలిపారు. మిగతా వారు మాత్రం కార్డుల్ని యాప్ లోనే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాల వెనుక ఓ కీలక కారణం ఉంది. రవాణాశాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్ని కేంద్ర ప్రభుత్వం వాహన్ పరివార్ వెబ్ సైట్ లో చేర్చింది. దీంతో రాష్ట్రాల రవాణాశాఖ వెబ్ సైట్లలో ఏదీ అందుబాటులో లేకుండా పోయింది. గతంలోలా కార్డుల డౌన్ లోడ్ వంటి ఆప్షన్లు కూడాతీసేశారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ కింది వెబ్ సైట్లలో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ లను డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. అలాగే ఏ యాప్ లో ఈ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చో వివరాలు కూడా ఇచ్చారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :