Wednesday, 28 October 2026 03:56:40 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

ఎస్వీయూ మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు, కమిషనర్ హరిత ఐఏఎస్ గారు

Date : 10 June 2023 10:49 AM Views : 808

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వీ యూనివర్శిటీ రోడ్డు నుండి జూ పార్క్ రోడ్డును కలుపుతూ నిర్మించబోవు మూడు మాస్టర్ ప్లాన్ రోడ్లు వెల్లె పరిసరాలను గురువారం సాయంత్రం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రతిపాదించబడిన మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రజల అవసరాలు దృష్ట్యా తీసుకురావడం జరుగుతున్నదని, అందులో భాగంగానే గతంలోనే ప్రతిపాదించిన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద నుండి, అదేవిధంగా మూడవ గేటు వద్ద నుండి, ప్లై ఓవర్ మొదలయ్యే అగ్రికల్చర్ కళాశాల ప్రక్క నుండు ప్రకాష్ నగర్ వైపు వెళ్లే విధంగా జూ పార్క్ రోడ్డును కలుపుతూ 3 ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావాలని తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదించడం జరిగిందన్నారు. ముఖ్యంగా తిరుపతిలో మెడికల్ సర్వీసెస్ కేంద్రంగా ఉన్నటువంటి స్విమ్స్, బర్డ్, రుయా, మెడికల్ కాలేజ్ ఆసుపత్రులకు పడమర వైపు నుండి ఒక 80 అడుగుల రోడ్డు జూపార్కు రోడ్డును కలిపే విధంగా తీసుకురావడంతో ఆసుపత్రులకు వచ్చే రోగులు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. అదేవిధంగా వీఐపీలు టౌన్ క్లబ్ సర్కిల్ పైనగా రుయా హాస్పిటల్ మీదుగా తిరుమలకు వెళ్లే సందర్భాల్లో ఎదురయ్యే ట్రాఫిక్కు కష్టాల నుండి బయటపడేందుకు ఎస్వీయూ మొదటి గేటు వైపుగా జూపార్క్ మీదుగా తిరుమల కి వెళ్లడం వలన ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. టిటిడి ఎస్వీ యూనివర్సిటీ అధికారులు యొక్క అనుమతులను పూర్తిస్థాయిలో తీసుకొని పనులు ప్రారంభించడం జరుగుతుందని కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :