Thursday, 30 July 2026 02:46:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పార్టీలో కష్టపడి పనిచేస్తేనే పదవులు వస్తాయి రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్

Date : 18 August 2025 08:49 PM Views : 632

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : జనసేన పార్టీలో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తే పదవులు వారిని వెతుక్కుంటూ వస్తాయని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు, రాష్ట్ర హస్తకళల కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జనసేన జండాగర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుంగునూరు నియోజకవర్గ జనసేన నాయకుడు కోలా సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కల్లూరు నుంచి రోడ్ షో ప్రారంభమై సోమల మండలం సూరయ్యగారి పల్లి వద్ద 100 అడుగుల జనసేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం సోమల బస్టాండు,చౌడేపల్లి సర్కిల్ వద్ద జనసేన జండాలను ఆవిష్కరించారు. అనంతరం పుంగనూరులోని తూర్పు మగసాల వద్ద ఏర్పాటుచేసిన జండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు అతికారి కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పుంగనూరు పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక శ్రీరస్తు కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ పరిశీలన అధికారి కృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారన్నారు. ముఖ్యంగా పుంగనూరులో రాక్షస గతంలో జరిగిందని ప్రస్తుతం పూట ప్రాంతంలో పుంగనూరు నియోజకవర్గం జరగకుండా శాంతియుతంగా పరిపాలన జరుగుతోందన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో జనసేన జండాగర్జన కార్యక్రమాన్ని చూస్తుంటే పాము పుంగనూరులో ఉన్నామా తిరుపతిలో ఉన్నామా అనిపిస్తోంది అన్నారు. జండా గడ్డల కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు జనసేన వీర మహిళలను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. సందర్భంగా కోలా సోమశేఖర్ మాట్లాడుతూ పాలు జనసేన పార్టీలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ ఆశయాలను చూసి, ప్రజలకు మంచి చేయాలని లక్ష్యంతోనే వచ్చాను అన్నారు. పార్టీలో తాను పదవులు ఆశించడం లేదని కార్యకర్తగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ పవన్ కళ్యాణ్ ఆశయాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం పని చేయాలన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో రాక్షసుడు ఎదిరించి పార్టీని నిలబెట్టిన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్, పగడాల రమణ, రాయల్ కుమార్, నాగభూషణ్ మండల అధ్యక్షులు అందరూ ఎంతగానో కృషి చేశారు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫోటోలు ప్రభుత్వంలో, అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని కొనియాడారు.పుంగనూరు నియోజకవర్గంలో జనసేన జెండా గర్జన కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా జనసేన పార్టీలో పదవులపై దృష్టి పెట్టకుండా పార్టీ అభివృద్ధి కష్టపడుతున్న వారిని అధిష్టానమే గుర్తించి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పార్టీలో పదవులు ఆశించి రావద్దని పార్టీ అభివృద్ధికి ప్రజల సంక్షేమం కోసమే పార్టీలకు రావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: