Wednesday, 29 July 2026 04:14:51 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మిథున్ రెడ్డి కి బెయిల్ మంజూరు కావాలని 1116 కొబ్బరి కాయలు కొట్టిన వైకాపా నేతలు

Date : 11 August 2025 08:05 PM Views : 703

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : మండలం లోని దిగువపల్లి గ్రామపంచాయతీ లో వెలసిన ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం లో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి కి తొందరగా బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ దేవస్థానం లో చౌడేపల్లి వైకాపా మండలాద్యక్షులు నాగభూషణ రెడ్డి ఆద్వర్యం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోనేటి వద్ద వెయ్యిన్ని నూట పదహారు కొబ్బరి కాయలు కొట్టారు.ఈ సందర్బంగా మండలాధ్యక్షులు నాగభూషణ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిని లిక్కర్ కేసలో కావాలనే కక్ష్య పూరితంగానే ఇరికించారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని రాజకీయం గా ఎదుగుదలను జీర్ణించుకోలేక అక్రమ మద్యం కేసలో ఇరికించారని, అంతే కాకుండా రాష్ట్ర మంతా తెలుగదేశం గాలి వీచినా పెద్దిరెడ్డి కుటుంబం పోటీచేసిన ప్రతిచోట గెలిచారని, అలాగే రాజకీయం గా వారిని ఎదుర్కోవడం చేతకాక అక్రమ కేసులలో ఇరికించారని, ఆయన అక్రమ లిక్కర్ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన అన్నారు.ప్రజలు అంతా గమనిస్తున్నారని,కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.అంతే కాకుండా కూటమి ప్రభుత్వం లో జెండాలు మోసిన కార్యకర్తలను ప్రక్కన పెడుతున్నారని, అటువంటివారు మా పార్టికి ఆకర్షితులౌతుంటే వాళ్ళను బెధిరించి, అక్రమ కేసులు బనాయిస్తామని, ప్రలోబాలకు గురిచేసి తిరిగి వారి పార్టీలో చేర్చుకోవడం వలన వాళ్ళకే నష్టం వాటిల్లుతుందని, ఇటువంటివన్నీ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటీసి దామోదర్ రాజు, వైస్ యం. పి. పి. సుధాకర్ రెడ్డి,మాజీ యం. పి. పి రుక్మిణమ్మ, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మండల ఉపాధ్యక్షులు జంగాలపల్లి వెంకట్రమణ, దుర్గసముద్రం చెంగారెడ్డి,యువనాయకుడు మిద్దింటి కిషోర్,మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, బోయకొండ మాజీ పాలకమండలి సభ్యులు శెట్టిపేట శంకరప్ప, పవన్, సర్పంచ్ లు ఓబుల్ రెడ్డి, షామీర్, షంషీర్, చిట్రెడ్డిపల్లి కృష్ణప్ప, దుర్గసముద్రం అమరనాథ్, యం. పి. టీ. సి శ్రీరాములు, నాయకులు ఓబులేశు, సుబ్రమణ్యం రాజు, గడ్డం వారి పల్లి గిరి, ఓదులపెట సుబ్రమణ్యం, శేషాద్రి, కాగితి వెంకట్రమణ, బుటకపల్లి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :