Thursday, 30 July 2026 06:38:36 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

శాంతియుతంగా సర్వసభ్య సమావేశం

Date : 11 June 2025 08:59 PM Views : 536

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ ; చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల సర్వసభ్య సమావేశం శాంతియుత వాతావరణం లో జరిగింది. ఈ కార్యక్రమం మండల పరిషత్ అధ్యక్షులు గాజుల రామ్మూర్తి ఆద్వర్యం లో జరిగింది.ఈ కార్యక్రమ నిర్వహణ మండల పరిషత్ అభివృద్ది అధికారిణి లీలామాధవి ఆద్వర్యం లో శాంతియుతంగా జరిగినది.ఈ సందర్బముగా గాజుల రామ్మూర్తి మాట్లాడుతూ ఏవైనా పనులకు సంబందించి బిల్లులు పెంఢింగ్ లో ఉంటే వెంటనే చేయించుకోవాలని సర్పంచులు,యం.పి.టీసిలు దగ్గరుండి ప్రజలకు తెలియజేయాలని మంచినీటి కొరత లేకుండా చూడాలని,హౌసింగ్ కు సంబందించి ఏవైనా బిల్లులు పెండింగ్ ఉంటే వెంటనే చెల్లించాలని,అలాగే ఇంకనూ నిర్మాణాలు చేపట్టని ఇంటి వారితో చర్చించి త్వరితగతిన పూర్తిచేయాలని, గ్రామాలలో నీటి యద్దడి రాకుండా చూడాలని,రైతుభరోసా కేంద్రాల ద్వారా సరైన సమయం లో ఎరువులు,విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని,పి.యం.కిషాన్ కోసం ఈకేవైసి సమస్య ఉన్న రైతులు సి.యస్.సి సెంటర్ల లో సమస్యను రెక్టిపై చేసుకోవాలని అన్నారు. టీకా కార్యక్రమం ప్రతి అంగన్ వాడి సెంటర్,పాఠశాలలో ఏర్పాటు చేశామని, అన్నారు.పాడి పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామని అన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్దీ హోల్డ్ భూముల పై సమగ్ర విచారణ జరుగుతుందని,మన మండలం లో దాదాపు గా ఆరువేల ఎకరాలు అసైన్మెంట్ నుండి సెటిల్మెంట్ అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో యం.పి.పి.మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని,కావున ఇలాంటి వి పునరావృత్తం కాకుండా చూడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి మండల అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,సర్పంచులు,యం.పి.టి.సి లు పాల్గొన్నారు.అంతే కాకుండా ఎవరైతే అధికారులు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు వారికి నోటీసులు పంపాలని సభ్యులు తీర్మానం చేశారు.అందుకు మండలం పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలా మాధవి ఆమోదం కూడా తెలియజేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: