Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్థానిక సింగాలగుంట మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో స్వతంత్ర వేడుకలు దిగ్విజయంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నరేంద్రనాథ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పిల్లలకు ఉపాధ్యాయులకు పిల్లల తల్లిదండ్రులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే స్వచ్ఛంద సంస్థ ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు అనేక పోటీ కార్యక్రమాలు పిల్లలకు నిర్వహించి వివిధ రంగాల్లో రాణించిన వారికి బహుపదుల్ని అందజేశారు. ఆ సంస్థ ఫౌండర్ తహసునీసా బేగం గారు మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యం పట్ల చదువు పట్ల శ్రద్ధ పెరగాలని చెప్పి ఒక జ్ఞాపక శక్తి పెరగాలని వాటికి సంబంధించిన చిట్కాలు కూడా ఈ సంస్థ ద్వారా అందజేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా చదువు సద్దల పైన ప్రత్యేకమైన దుష్టు సాదిస్తూ విద్యార్థులకు కావాల్సిన మౌలిక అవసరాలను వారికి అనేక రంగాలలో అవగాహనను కల్పిస్తున్నామని తెలియజేశారు ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య వ్యక్తులు గంగాధర్ గారు, రాజ్ కుమార్ గారు, శిరీష గారు హేమ గారు, ఉమాదేవి గారు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV