Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : సీబీఐ మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు.. తల్లి బాగోగులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉ:దని డాక్టర్లు చెబుతున్నారి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ విచారణకు వెళతారా లేదా అన్నది చూడాలి. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని విచారణకు వెళ్లలేదు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Ys Vivekananda Reddy Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 (సోమవారం)న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. తల్లి ఆస్పత్రిలో ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు
Admin
Famous TV