Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు శ్రీ జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మాండచారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారి సహకారంతో సీనియర్ కళాకారుడు 40 సంవత్సరాల నుంచి హార్మోనిస్టుగా భక్తి భావనపై కృషి చేస్తున్న బాల హనుమంతుకు సన్మానం మరియు భక్తి భావనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా బాల హనుమంతుని ఘనంగా సన్మానించిన బ్రహ్మాండచారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ విలువైన సమయంలో ఒక గంట అయినా దైవానికి కేటాయించాలని బ్రహ్మానంద చారి కోరారు సన్మాన గ్రహీత బాల హనుమంతు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతైన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మానసర శృతి భజన మండలి అధ్యక్షుడు కేవీ వెంకటసుబ్బయ్య గౌడ్ శ్రీనివాసులు సుధాకర్ గౌడ్ లక్ష్మీదేవి భక్త బృందం పాల్గొన్నారు
Admin
Famous TV