Thursday, 30 July 2026 04:28:38 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ విభాగం లో డాక్టర్ ఏ వి ఎస్ఎస్ రామారావు అవార్డ్స్ మహోత్సవం.

Date : 19 November 2023 06:27 PM Views : 540

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఎస్వీ వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ విభాగం లెక్చరర్ గ్యాలరీలో డాక్టర్ ఏ వి ఎస్ ఎస్ రామారావు 99వ జన్మదిన సందర్భంగా ఎస్. వి వైద్య కళాశాలలో బయో కెమిస్ట్రీ విభాగం నందు అత్యధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థికి డాక్టర్ ఏవీఎస్ రామారావు మెమోరియల్ వారు ఇక ప్రతి సంవత్సరము బయో కెమిస్ట్రీ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన వారికి గోల్డ్ మెడల్ లు, నగదు బహుకరిస్తూ విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడం జరుగుతుందని, ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎం శ్రీనివాసులు, రిటైర్డ్ ప్రొఫెసర్ చర్మవ్యాధి నిపుణులు, పిల్లలను ఉద్దేశించి వైద్య విద్యలో పోటీపడి చదువుకోవాలని ఇలాంటి ప్రతీ డిపార్ట్మెంట్లో మంచి ప్రోత్సాహాలు అందుకుని పేద రోగులకు మెరుగైన వైద్యం అందించినట్లయితే సమాజంలో గొప్ప వైద్యులుగా మెలగవచ్చునని వైద్య విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్ వి వైద్య కళాశాలో 2021- 2022వ సంవత్సరం బయో కెమిస్ట్రీ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన కుమారి. సాయి దీపిక అనే వైద్య విద్యార్థినికి నగదు రూపాయలు 10,000 /-, గోల్డ్ మెడలు ఇచ్చి సత్కరించడం జరిగినది. 2024వ, సంవత్సరంలో 100 సంవత్సరాలు డాక్టర్ ఏ వి ఎస్ ఎస్ రామారావు పూర్తి అగు సందర్భంలో బయో కెమిస్ట్రీ విభాగమునకు, వైద్య విద్యార్థులకు చాలా విలువైన వసతులు కల్పించడానికి ప్రణాళికను చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ , ఇలాగ దాతలు ముందుకు వచ్చినట్లయితే మనము ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి పథంలో నడపడానికి ఎంతో దోహదపడుతుందని , వైద్య విద్యార్థులలు, వైద్యం అభ్యసించేటప్పుడు పోటీపడి చదివే తత్వాన్ని అవలంబించుకొని మెరుగైన వైద్య విద్యను నేర్చుకొని, వైద్య, పరిశోధనలో ముందడుగు వేస్తూ , వైద్య కళాశాలకు ప్రభుత్వానికి ఎనలేని సేవలు అందించాలని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి వైద్యులుగా మెలగాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్) డాక్టర్ సునీత, బయో కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మాధవి లత, బయో కెమిస్ట్రీ విభాగ వైద్యులు, సిబ్బంది మరియు ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :