Sunday, 19 April 2026 05:37:40 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది - ఇంటింటి ప్రచారంలో పులివర్తి నాని

ఎన్నికలు కోసం ఎదురుచూస్తున్నారు -టీడీపీ భారీ మెజార్టీ సాధిస్తుంది

Date : 09 March 2024 07:13 PM Views : 692

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వైసీపీ అరాచక పాలనలో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు మార్పు కోరుకోవడం స్పష్టంగా కనిపిస్తుందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతి రూరల్ మండలం, బ్రహ్మణపల్లి పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గురించి వివరించారు. సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేపట్టారు. ఈ ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని పులివర్తి నాని అన్నారు. బాదుడే.. బాదుడు తప్ప.. ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం విస్మరించారని ధ్వజమెత్తారు. కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచేశారని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలస పోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా తరతరాలుగా సరిపడా సంపాదించేశారని ఆరోపించారు. మఠం భూములు స్వాహా చేసి వెంచర్లు వేసి అమాయకపు ప్రజలకు అమ్మేశారని మండిపడ్డారు. మఠం భూముల్లో అక్రమ కట్టడాలు అంటూ ఎండోమెంట్ అధికారులతో కలిసి మళ్లీ కబ్జాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే తాయిలాలు పంచుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నారని వెల్లడించారు. పర్యటిస్తున్న ప్రతి చోటా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా‌‌ అని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని పులివర్తి నాని స్పష్టం చేశారు. చంద్రగిరి కోటపై పసుపు జెండా రెపరెపలు చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :