Thursday, 30 July 2026 09:25:30 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్ వి వైద్య కళాశాలలో పీ.జీ వైద్య విద్యార్థులకు ఎథిక్స్ పై అవగాహన కార్యక్రమం

Date : 25 March 2024 06:44 PM Views : 682

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సోమవారం ఎస్వీ వైద్య కళాశాల భువన విజయం ఆడిటోరియం నందు పీజీ వైద్య విద్యార్థులకు మెడికల్ ఎథిక్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథికల్ మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ రాయపు రమేష్ బాబు, స్పీకర్ గా , ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్వీ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థులకు వైద్యంలో అనుసరించవలసిన పద్ధతులు, వాటి ఆవశ్యకతను గురించి అన్ని విభాగాల పీజీ వైద్య విద్యార్థులకు డాక్టర్ రాయపు రమేష్ బాబు ప్రసంగించారు. డాక్టర్ రాయపూర్ రమేష్ మాట్లాడుతూ వైద్య విద్య లోని ఎప్పటికప్పుడు వస్తున్న , కొత్త కొత్త వ్యాధులు, మెడికల్ టెక్నాలజీ తో ఎదుర్కోవలసిన వాటిలోని ఆవశ్యకతను, ప్రజలకు, రోగులకు అందించవలసిన వైద్యం పై చర్చ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు అందిస్తున్న వైద్యంలో నియమ నిబంధనలకు అనుసరించి మన వైద్యం చేస్తున్నామా లేదా అని ప్రతి ఒక్క పీజీ వైద్య విద్యార్థు అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాబోవు రోజుల్లో వైద్యంలో విప్లతికమైన మార్పులు వస్తున్న సందర్భాలలో పాటించవలసిన, నియమ నిబంధనల గురించి పీజీ వైద్య విద్యార్థులకు ఎథిక్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో డాక్టర్ రాయపు రమేష్ క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వైద్యం చేసేటప్పుడు వైద్యం అందించేటప్పుడు ప్రతి ఒక్క యు.జి,పి.జి, వైద్య విద్యార్థి వైద్యంపై మంచి అవగాహన నైపుణ్యముతో పేద రోగులకు ప్రజలకు , మెరుగైన వైద్యం అందించవలసిందిగా, వైద్యం లో నియమ నిబంధనలు కూడా పాటిస్తూ ప్రజలకు మంచి వైద్యం అందించవలసిందిగా ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రసూతి వైద్యశాల సూపరిటెండెంట్ డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పీజీ వైద్య విద్యార్థులకు వైద్యరంగంలో ఎథిక్స్, నియమ నిబంధనలు , అనుసరిస్తూ మెరుగైన వైద్యం అందించి ప్రజల దృష్టిలో 70, 80 సంవత్సరాలు వయస్సు వరకు గొప్ప వైద్యులుగా ఎదగాలని, ఎథిక్స్ కు విరుద్ధంగా పోకుండా మంచి వైద్యం అందించి , సంఘంలో గొప్ప వైద్యులుగా మెలగాలని ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు . ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిరీటి, (మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం),అన్ని విభాగాల పీజీ వైద్య విద్యార్థులు, విభాగాధిపతులు, అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రసూతి వైద్యశాల డాక్టర్ ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: