Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : 21/ 9/ 2023 నుండి మూడురోజులపాటు NTR జిల్లా విజయవాడ రూరల్ మండలం " నున్న" వికాస్ విద్యాసంస్థల ఆవరణంలో జరిగిన 67వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల రెజ్లింగ్ అండర్ 14 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో జి.ప.ఉన్నత పాఠశాల పల్లం విద్యారులు రాష్ట్రస్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ పాఠశాలకు చెందినటువంటి మోహనాచారి బంగారు పతకాన్ని సాధించి రాష్ట్రస్థాయినుంచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు.మరియు 8వ తరగతి చదువుతున్న నాగరాజు కాంస్య పతకం సాధించారు. క్రీడలలో విజయం సాధించినటువంటి విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆనం గారు సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా క్రీడలలో రాణించగలిగితే మంచి ఆరోగ్యంతో పాటు ఉన్నత చదువులలోనూ మరియు ఉద్యోగ అవకాశాలలోనూ క్రీడా రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందవచ్చునని తెలియజేశారు అదేవిధంగా విద్యార్థుల విజయానికి కారణమైనటువంటి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుని శ్రీమతి పుష్పవాణి గారిని ప్రధానోపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ మరియు సిబ్బంది దుస్సాలువాతో సన్మానించారు.ఈ ఈ కార్యక్రమంలో పాఠశాల మొదటి అసిస్టెంట్ ఒకే బాబు గారు మెహర్ బాబా గారు వ్యాయామ ఉపాధ్యాయలని వాణి గారు రెడ్డప్ప గారు సోమశేఖర్ రాజుగారు రాజశేఖర్ గారు పాల్గొన్నారు.
Admin
Famous TV