Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండల పరిధిలో ఉన్న కలగటూరు పరిధిలో అక్రమ మట్టి మాఫియా ఇసుక మాఫియా రోజురోజుకు పుంజుకుంటుంది ప్రభుత్వ సంపద అయిన చెరువులు, వాగులలో అక్రమ మాఫియా ద్వారా ప్రభుత్వ సంపాదన పక్కదారి పట్టిస్తున్నారు జెసిబిలు, ట్రాక్టర్ల సహాయంతో మట్టిని అధిక సంఖ్యలో ఇటుక బట్టీలకు, కమర్షియల్ లేఔట్లకు రవాణా చేస్తున్నారు కలుగుటూరు సమీపంలో ఉన్న చెరువులో ఈరోజు అనగా 16.06.2023 శుక్రవారం మూడు జెసిబి లు, 30 ట్రాక్టర్లు సహాయంతో వందలాది మట్టి లోడ్లను కమర్షియల్ పనులకు తీసుకెళ్తుంటే స్థానిక సచివాలయ సిబ్బంది కానీ, వీఆర్వో కానీ, పట్టించుకున్న పాపాన పోలేదు ఈ కార్యక్రమాన్ని చూసిన పలువురు ఇందులో అధికారులు చేత వాటం ఎంతో ఉందో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రోజురోజుకు ప్రభుత్వ సంపాదన పక్కదారి పట్టిస్తుంటే అధికార యంత్రాంగం నిద్ర వ్యవస్థలో ఉండడం మరోసారి అధికారం వైఫల్యానికి నిదర్శనంగా ఉంది స్థానిక ఎమ్మార్వో గారు సైతం పర్యవేక్షణ చేయకపోవడం హాస్యాస్పదం ఇప్పటికైనా పై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి
Admin
Famous TV