Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : కూటమి సహకారం, కార్యకర్తలు కృషి ఫలించింది. చంద్రబాబుకు కానుక చంద్రగిరి నియోజకవర్గం _ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి "పులివర్తి నాని" చంద్రగిరి నియోజకవర్గంలో నా గెలుపు ప్రజలకు అంకితమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై 43,396 ఓట్ల భారీ మెజార్టీ తో గెలుపొందారు. బుధవారం కౌంటింగ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 1994లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నారా రామ్మూర్తి నాయుడు గెలుపొందారని అన్నారు. 2024 ఎన్నికల్లో 30 ఏళ్లు చరిత్ర ను తరగరాశామని వ్యాఖ్యానించారు. 43,852 వేల ఓట్లు రికార్డు మెజార్టీ అందించిన చంద్రగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కూటమి సహకారం, కార్యకర్తల కృషి ఫలితమే నా గెలుపుకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ఈ గెలుపును చంద్రబాబుకు కానుకగా అందిస్తున్నానని ప్రకటించారు. నా గెలుపులో భాగస్వామ్యమైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నా వెన్నెంటూ ఉంటూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. చంద్రబాబు ఆశీస్సులతో, నారా లోకేష్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెల్లడించారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావులేకుండా, కుల, మత, వర్గ తారతమ్యాలు లేకుండా అభివృద్ధే ఏకైక అజెండా గా పని చేస్తానని పేర్కొన్నారు.
Admin
Famous TV