Famous TV - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు : ఎన్నడూ, ఎవరూ ఆలోచన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పధకాలను అందిస్తూ, సంక్షేమ పథకాల లబ్ది ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, ప్రజారంజక పాలనను అందిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం, దేశంలోనే ప్రధమ స్థానంలో ఉంది.జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 4సంవత్సరాల కాలంలో ఎన్నో అవాంతరాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో రాజీ పడలేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూశారు.జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్త పరుస్తూ, అండగా నిలుస్తున్నారు.నా వల్ల మీకు మేలు జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అని ధైర్యంగా చెప్పగల్గిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నాడు.
సొంత మామను వెన్నుపోటు పొడిచి, మనోవేదనకు గురి చేసిన చంద్రబాబు, NTR కు శత జయంతి వేడుకలు జరుపుతున్నాడు. ????NTR పేరును ఎన్నికల్లో తప్ప, ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ????జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జిల్లాకు NTR పేరు పెట్టారు. ????శతజయంతి ఉత్సవాలతో ఎన్టీఆర్ ఆత్మకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడు. ????మహనాడులో ఫెస్ 1 మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, ఎన్ని ఫేస్ లు విడుదల చేస్తాడో, ఇంకెన్ని వస్తాయో తెలియని పరిస్థితి. ????చంద్రబాబు 2014 ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు చేస్తే, అధికారంలోకి వచ్చి, కనీసం 10 శాతమైనా అమలు చేశాడా..! ????జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, 98 శాతం హామీలు అమలు చేశారు. ????జగన్మోహన్ రెడ్డి గారు DBT పద్ధతి ద్వారా 2.11లక్ష కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ????చంద్రబాబు తానిచ్చిన హామీలలో ఎంత మేర అమలు చేశాడో ప్రజలకు చెప్పగలడా..!. ???? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు శంఖుస్థాపనలు తప్ప, పనులు పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయా.. ????నెల్లూరు జిల్లాలో ఒక్క అభివృద్ధి పనినైనా పూర్తి చేసి, ప్రారంభించాడా.. ????తాను అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నాడా... ????చంద్రబాబు ఇచ్చే మేనిఫెస్టోకు విలువ ఉందా..! ????సుదీర్ఘ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చెప్పుకోదగ్గ పధకం ఒక్కటైనా అమలు చేశాడా.. ????చంద్రబాబు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో మా దగ్గర ఉంది.????NTR గారు ఎన్నికల్లో మద్యపాన నిషేధం, 2 రూ.లకే బియ్యం ప్రకటించి, అధికారంలోకి వచ్చి అమలు చేశారు. ????NTR మనిఫెస్టోకు కూడా చంద్రబాబు వెన్నపోటు పొడిచాడు. ????2014 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోగలిగాడా.. ????మేనిఫెస్టోను 10 నిమిషాల్లో ఇంటర్నెట్ నుంచి మాయం చేసిన ఘనత చంద్రబాబుది. ????చంద్రబాబు హయాంలో పేదలు పరిస్థితి అధోపాతాలానికి దిగజారిపోయింది. ????మహిళా సంఘాలకు రుణ మాఫీ పేరుతో మోసం చేసి, ఆర్ధికంగా చతికిల పడిపోయేలా చేశాడు. ????రైతులకు బేషరత్తు రుణమాఫీ చేస్తానంటూ వాగ్దానం ఇచ్చి, చేయకుండా మోసం చేశాడు. ????రాజధాని పేరిట రైతుల భూములను కాజేశాడు.. ????చంద్రబాబు హయాంలో దళారులు, జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాలలో విపరీతంగా దోచుకున్నారు. ????అధికారంలో ఉన్నప్పుడు చేయని చంద్రబాబుకు, అధికారం ఇచ్చే పరిస్థితులలో ప్రజలు లేరు.
????చంద్రబాబు కాపీ క్యాట్ ????కర్ణాటక ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలను ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తానంటున్నాడు. ????చంద్రబాబు మహానాడులో అమలు చేస్తానంటున్న తల్లికి వందనం పధకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న అమ్మ ఒడి పధకమే కదా.. ????నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అంటూ కల్లబుల్లి కబుర్లు చెబుతున్నాడు. ????2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంతమందికి నిరుద్యోగభృతి ఇచ్చాడు? ????చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా సంపూర్ణంగా అమలు చేశాడా.. ????చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టో పట్ల ప్రజలు ఆలోచన చేయడం లేదు. ????ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు ప్రజల తరఫున, రాష్ట్ర రైతుల పక్షాన హృదయపూర్వక అభినందనలు.
Admin
Famous TV