Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్: ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పి.జి.ఆర్.యస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 380 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు.జిల్లా కలెక్టర్ వారితో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్,డి ఆర్ ఓ కె.మోహన్ కుమార్,డిప్యూటీ కలెక్టర్ విజయ లక్ష్మీ,కుసుమ కుమారి,చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు,వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితులో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు.మొత్తం 380 అర్జీలు ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు రెవిన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 240,జడ్పి సీఈవో 02,పోలీస్ 10, పంచాయతీ రాజ్ 03,డీఈవో 04,ద్వామ 05,హార్టికల్చర్ 35,డి ఆర్ డి ఏ 45,నీటిపారుదల శాఖ 03,ఏపీ ఎస్ పి డి సి ఎల్ 03,సర్వ శిక్షణ అభియాన్ 03,అనిమల్ హస్బండ్రీ 09,డిపిఓ 08, సిపిఓ 03,ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 01,డిజేబుల్ వెల్ఫేర్ 06, అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్,అసిస్టెంట్ కలెక్టర్,డి అర్ ఓ,ఆర్డిఓ,డిప్యూటీ కలెక్టర్ లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV