Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ** తిరుపతి నగరం, స్థానిక ఆర్. సి. రోడ్ లోని కార్మిక రాజ్య బీమా (ఈ. ఎస్. ఐ )ఆసుపత్రి ని శుక్రవారం ఉదయం రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీ, బాయిలర్స్, బీమా వైద్య శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి. సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లోని పురుషుల వార్డును తనిఖీ చేసి, పేషెంట్స్ కు అందుతున్న వైద్య సేవల విషయమై అక్కడ చికిత్స పొందుతున్న రోగులను నుండి అడిగి తెలుసుకున్నారు. అలాగే,ల్యాబ్, ఆర్.ఓ. వాటర్ ప్లాంట్, ఫిజియోథెరపీ విభాగలను తనిఖీ చేశారు.సిబ్బంది ముఖ హాజరు సమయపాలన తనిఖీ చేశారు.ఆసుపత్రిలో శుభ్రత, పేషెంట్ల వైద్యం, వారి పర్యవేక్షణ, canteen , అన్ని విధాలా సక్రమంగా జరుగుతున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గారిని అభినందించారు. అనంతరం ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు..ఈ. ఎస్. ఐ. లబ్ధిదారులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సుభాష్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు ఇవ్వాలని, సిబ్బంది మధ్య నెలకొన్న అంతర్గత తార, తమ్య బేధ,భావాలను విడనాడి ఆసుపత్రి ని మరింత అభివృద్ధి చేయాలని డాక్టర్స్, సిబ్బందికి మంత్రి సూచించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి లో 15ఏళ్లకు పైగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది మంత్రి సుభాష్ కు వినతి పత్రం ఇస్తూ బీమా వైద్య శాఖ లో పెద్ద ఎత్తున ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వేడుకొన్నారు. అలాగే రెండు దశాబ్దాలుగా ఆసుపత్రి నే నమ్ముకొని పనిచేస్తున్న హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు పెంచాలని మంత్రి సుభాష్ కు విన్నవించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. ఎం. శ్యాంబాబు, ఆర్. ఎం. ఓ. డాక్టర్. ఎ. వి. ఎస్. ప్రసాద్, ఆసుపత్రి డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు
Admin
Famous TV