Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా గట్టి భద్రతా చర్యలు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా అల్లా అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని వారి జీవితం సుఖశాంతులతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నానని జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ మరియు తొలి ఏకాదశి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ. శ్రీ పి.పరమేశ్వర రెడ్డీ, ఐపీఎస్ ,గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ తిరుపతి ఒక శాంతి నిలయం ఇక్కడ అన్నీ మతాలు ఒక్కటే ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకుంటూ సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కోరారు. అందరూ ఐకమత్యంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా మిత్ర భావంతో ప్రేమను పంచుకుంటూ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రార్ధన మందిరాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని శాంతిభద్రతలకు విగాథం కలగకుండా నోడల్ అధికారిగా తిరుపతి శాంతి భద్రతల అడిషనల్ ఎస్పి శ్రీ కులశేఖర్ వారిని నియమించి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించడం జరుగుతుందన్నారు.. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రార్థన మందిరాలు మసీదుల కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడి భద్రతా పరమైన అంశాలపై అదికారులు చర్చించారు .24 గంటలు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రత్యేకంగా సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల పై జిల్లా పోలీస్ శాఖ గట్టి నిఘా ఉంచిందని ఆకతాయి చేష్టలతో సోషల్ మీడియాలో వదంతులను ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.సర్వ మతాల సమ్మేళన మైన భారతావనిలో తిరుపతి నగరం ఒక ఆధ్యాత్మిక నగరం ఇక్కడ ఇలాంటి అలజడులకు తావు లేదు మనం బాగుంటే మన చుట్టూ అందరూ బాగుంటారు భిన్న భావాలు మన చుట్టూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు సోదర భావంతో ఎలాంటి ఘటనలకు తావు ఇవ్వకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము ఇదే స్పూర్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. పార్కింగ్ కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో తమ వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసి ఇతర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా చూడాలని కోరారు. ఏదైనా ఘటన గురించి ముందస్తు చట్టబద్ధమైన సమాచారం ఇస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మరియు బహిరంగ ప్రదేశాల వద్ద ఎలాంటి జీవ హింస చేయరాదన్నారు. ఏదైనా సమాచారం ఉంటే Dial 100, Police Whatsapp No. 80999 99977 +నోడల్ అధికారి 9491361257 నంబర్ కు సమాచారము అందించి ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి, ఐపీఎస్., గారు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Admin
Famous TV