Saturday, 13 June 2026 12:26:03 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలి

Date : 16 November 2025 06:26 PM Views : 599

Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచటంలో ఉపాధ్యాయులు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర ఆర్టీఐ కమీషనర్ డా. రెహానా బేగం పిలుపునిచ్చారు. పుస్తకాలు చదవటం వల్ల పిల్లల్లో భాషా నైపుణ్యాలు, సృజనాత్మకత పెరుగుతాయని అన్నారు. పాఠశాలల్లో ప్రతి రోజు రీడింగ్ అవర్, ప్రతి వారం స్టోరీ అవర్ నిర్వహించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. మరో గ్రంధాలయ ఉద్యమం నేతృత్వంలో పాఠశాలలు, కళాశాలల్లో పుస్తక పఠనం ఆవశ్యకత పై జరిగిన చర్చా గోష్టిలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు విజయవాడ రీజన్ ఆర్పీఎఫ్ సీఐ మధుసూధన్ గారు మాట్లాడుతూ పుస్తకాలు చదివే అలవాటు పెరిగితే పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడతారని, ప్రతి విద్యార్ధిలో ఉండే విభిన్నమైన నైపుణ్యాలు బయటకు వస్తాయని మరో గ్రంథాలయ ఉద్యమం మంచికంటి వెంకటేశ్వర రావు అన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తే పాఠశాలల్లో లైబ్రరీ అవర్ సమర్థవంతంగా అమలు అవుతుందని ఏపీటీఎఫ్ ప్రతినిధి టీ. నాగరాజు పేర్కొన్నారు. టీచర్లు, ప్రిన్సిపల్స్ చిత్తశుద్ధితో పని చేసి ప్రతి స్కూల్ లో లైబ్రరీలు, రీడింగ్ కల్చర్ పెంచాలని పీటీఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రసన్న అన్నారు. విజయవాడలోని విద్యాంజలి హైస్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మణ రావు, వీరప్పయ్య, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :