Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా లో JAAP యూనియన్ 33వ మహా సభకు ముఖ్య అతిథులు జాప్ యూనియన్ వ్యవస్థాపాక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిపతి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా జాప్ యూనియన్ అధ్యక్షులు జాన్ బాబు, ప్రధాన కార్యదర్శి ఫైరోజ్ బాషా, ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ సెకరేట్రీ గౌరీ శంకర్ ల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలోని జాప్ యూనియన్ అతిరథ మహారతులు, జర్నలిస్ట్ మిత్రులు హాజరుకావడం జరిగింది. జాప్ యూనియన్ మహాసభ సమావేశం లో వ్యవస్థాపాక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొనే సమస్యలను ప్రస్తావించనన్నట్లు జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్)దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు.మహాసభ కు రాష్ట్రం లోని అన్ని జిల్లా ల నుంచి పెద్ద సంఖ్యలో జాప్ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్బంగా రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయస్థాయిలో ప్రస్తావించి ప్రత్యేకంగా తీర్మానం కూడా చేయనున్నమని తెలిపారు. ముఖ్యంగా పాత్రికేయులకు సంబంధించి ఆరోగ్య భీమా, పెన్షన్ ఉద్యోగ భద్రత,సకాలంలో అర్హులైన పాత్రికేయులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు, రైలు ,బస్సుల్లో రాయితీలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో పాత్రికేయులకు ఇల్లు ఇళ్ల స్థలాల మంజూరు ఈ అంశం పై సంబదిత మంత్రి గారు త్వరలోనె జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారని ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ముందుకురావడం హర్షించదగ్గ విషయం అన్నారు. సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళ ప్రధాన కార్యదర్శి హేమావతి. చిత్తూర్ నగర్ టిడిపి అధ్యక్షులు నరేష్ చౌదరి, పచ్చప్ప, 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రమీల ఆనంద్, బిజెపి రాష్ట్ర నాయకులు చిట్టిబాబు. అడ్వకేట్ భాస్కర్, ప్రముఖులు చంద్రశేఖర్, నరేష్,ఆరని శ్రీనివాసులు, చిట్టిబాబు చిత్తూరు,తిరుపతి, అన్నమయ్య, శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు రాష్ట్రం లోని పలు జిల్లాల జాప్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు,యూనియన్ సభ్యులు, జర్నలిస్ట్ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
Famous TV