Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఘణంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద మండల పరిషత్ అధ్యక్షులు గాజుల రామ్మూర్తి,జడ్పీటీసీ నడింపల్లి దామోదర్ రాజు,మండల పరిషత్ ఉపాధ్యక్షులు రామసాని సుధాకర్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ షాధిక్ భాషా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి లీలామాధవి,సూపరింటెండెంట్ షబ్బీర్ అహామ్మద్,ఉపాధాహామీ సిబ్బంది దానయ్య,ధనంజయ, సిబ్బంది పాల్గొన్నారు.అలాగే మండలంలోగల అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఘణంగా జెండా ఆవిష్కరణ చేశారు.మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హర్షల్ ఫౌండేషన్ అధ్యక్షులు భవాణి పాఠశాలలో గత సంవత్సరం మొదట వచ్చన వారికి ఐదువేలు భువనేశ్వరి, భవ్యశ్రీ లకు, ద్వితియ స్థానం వచ్చిన రమ్యశ్రీ కి నాలుగు వేలు,తృతీయ స్థానం వచ్చిన పల్లవి,హేమల కు మూడు వేలు చొప్పున,అలాగే ఏలూరు ప్రిన్సిపల్ జడ్జి శైలజ తమ తల్లి జ్ఞాపకార్థం ఇరవైవేలు ఇవ్వడం జరిగింది, అలాగే పాఠశాల పూర్వవిద్యార్థులు 1984-85 సంవత్సరం విద్యార్థులు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రెండువేలు చొప్పున ఉపాధ్యాయులు రమేష్ చేతుల మీదుగా జై మోహన్ అందించడం జరిగింది.ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ జయప్రకాష్ ఆధ్వర్యంలో ఘణంగా గణతంత్ర దినోత్సవం జరుపుకొని,ఎన్.ఎస్.ఎస్ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.సింగిల్ విండో కార్యాలయం నందు చైర్మన్ పగడాల హరిప్రసాద్ రాయల్ ఆధ్వర్యంలో సిఈఓ మునిరాజ సమక్షంలో జెండా ఆవిష్కరణ చేశారు.ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ఈఓ, ఉపకమీషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు.అంబేద్కర్ భవనం నందు, పోలీస్టేషన్ నందు ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఘణంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయానికి సంబందించిన సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV