Tuesday, 27 October 2026 03:54:41 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

చిన్న వాడైనా ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు

Date : 12 October 2023 01:06 PM Views : 637

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : చిన్నవాడైనా పెద్ద మనస్సు తో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతూ అభివృధ్ది సంక్షేమానికి మన ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా అన్నారు.గురువారం ఉదయం వడమాల పేట మండలం పూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొనగా చిత్తూరు ఎం పి రెడ్డెప్ప , జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి రోజా మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు అందించాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని సదర్శించి 2 నుండి 3 వేల రూపాయలు విలువ చేసే వైద్యపరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలు అందిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన. జగనన్న పేదవాడి ఆరోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తన తండ్రి ప్రారంభిస్తే రెండు అడుగులు ముందుకు వేసి పేదల ఆరోగ్యం కోసం 17 మెడికల్ కళాశాల ఏర్పాటు, తద్వారా పేదలకు వైద్య సదుపాయాలు మెరుగు పరచడం , నాడు నేడు ద్వారా ఆసుపత్రుల అభివృధ్ది, ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటివద్దకే వైద్యం , అందరికీ అండగానిలిచేందుకు ఆరోగ్య సురక్ష తో క్యాంపులు ఏర్పాటు, ప్రముఖ వైద్యుల పర్యవేక్షణ, చికిత్సలు అందించడం జరుగుతున్నది అన్నారు. అనారోగ్యం తో ప్రాణాల మీదికి వచ్చి ఆస్తులు అమ్ముకొరదనే , అప్పుల పాలు కాకూడదని వైద్య రంగానికి పెద్ద పేట వేస్తున్నారని అన్నారు. రక్తహీనత లేకుండా సంపూర్ణ పోషణ అందించడం, ప్రజల ఆరోగ్య భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారనీ అన్నారు. కోవి డ్ సమయంలో వైద్యం, మందులు , పౌష్టికాహారం వంటివి అందించి ఆదుకున్న విషయం మనకు తెలుసు అన్నారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన విధంగా అనేక సంక్షేమ bపథకాలను మహిళలకు, పేదవారికి అర్హత గల వారికి అందిస్తూ ఆదుకుంటున్నారని అన్నారు. వైద్య పరంగా అనేరకాలుగా పేదలకు సదుపాయాలు తెచ్చారని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్య విషయంలో చిన్నది , పెద్దది కావచ్చు ప్రతి కుటుంబము పరీక్షలు చేసుకుని మందులు పొందాలని, ఆరోగ్యమే లక్ష్యంగా ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు. మొదటి దశ లో వాల్ ఇంటర్లు ఇంటి వద్దకే వెళ్లడం , ఏఎన్ఎం , వైద్యులు అనారోగ్యానికి గురైన వారిని గుర్తించడం ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం, గ్రామాల్లోని సురక్ష క్యాంపులు నిర్వహించి, అనుభవం ఉన్న డాక్టర్లను తీసుకురావడం వైద్య చికిత్సలు అందించడం అనారోగ్య తీవ్రతను బట్టి రెఫెరల్ ఆసుపత్రులకు పంపించి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను అందించడం జరుగుతున్నదని తెలిపారు. పూడి గ్రామంలో 997 కుటుంబాలకు గాను నేడు 552 టోకెన్లను జారీ చేసి వైద్య సేవలు ఉచితంగా అందించడానికి ప్రజలను తీసుకురావడం జరిగిందని అన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం చేయడానికి తమవంతుగా పాల్గొన్న అధికారులకు, వైద్యుల కు, సిబ్బందికి ధన్యవాదాలు అన్నారు. అనంతరం కంటి అద్దాలు లబ్దిదారులకు స్వయంగా మంత్రి, ఎం. పి., కలెక్టర్ అందించారు. ఈ క్యాంపులో డాక్టర్లు సుజిత, కిరణ్మయి, పావని , చక్రపాణి , అధికారులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :