Wednesday, 29 July 2026 04:11:06 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది - మంత్రి అచ్చెన్నాయుడు

Date : 14 June 2025 06:20 PM Views : 539

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవడానికి సబ్సిడీ రూపంలో 168 కోట్ల రూపాయలు చెల్లిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అనుబంధ రంగాల శాఖ మంత్రివర్యులు కే అచ్చమ్మ నాయుడు తెలిపారు. జిల్లాలో ఒక్కరోజు అనగా శనివారం పర్యటనలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల మండలంలో గొల్లమడుగు నందు మామిడికాయల నిల్వ ఉంచిన పండ్ల యూనిట్ ను పరిశీలించుచున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దుగ్గుమళ్ళ ప్రసాద్ రావు, హర్ట్ కల్చర్ సెక్రెటరీ రాజశేఖర్ బాబు, ఆర్టికల్చర్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంపెనీ నందు మామిడికాయ ప్రాసెస్ యూనిట్లను పరిశీలించారు. మామిడికాయ జ్యూస్ ఎలా తయారవుతాదో పరిశీలించారు అనంతరం పల్లూరు నందు మామిడి రైతులతో ముచ్చటించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రివర్యులు మాట్లాడుతూ రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి తెలుగు దేశ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆలోచనతో మామిడి రైతులను ఆదుకోవడానికి ఈరోజు కంపెనీలతో చర్చించి ఒక ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు వివిధ కంపెనీలు 8 రూపాయలకే కేజీ మామిడి పండ్లు ధర నిర్ణయించడం జరిగిందని 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల స్వేచ్ఛగా వారు పండించిన మామిడి పంటను, మండిళ్లలో గాని, మార్కెట్లో గాని అమ్ముకోవచ్చునని తెలిపారు, సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు చివరి కాయ వరకు విక్రయించుకోవచ్చునని.2019వ సంవత్సరంలో జిల్లాలో మామిడి ధర తెలుగుదేశం ప్రభుత్వమే 7.50 పైసలకు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు.రైతులు నాణ్యమైన మామిడికాయలను కంపెనీలకు సరఫరా చేయాలని ఆదేశించారు. మామిడి రైతులకు 168 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో అందజేస్తున్నామని మంత్రివర్యులు తెలిపారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేయుచున్నాడని తెలిపారు.రైతులు మార్కెట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద మామిడికాయలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం 22 మెట్రిక్ టన్నులు మామిడికాయలను కొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :