Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీకాళహస్తీశ్వర ఆలయ జల వినాయక సమీపంలో కార్ పార్కింగ్ లో ఓ మహిళ కారులో ఇరుక్కున పోయి ఊపిరి ఆడకుండా విలవిలలాడుతూ కాపాడాలని అర్ధనార్ధాలు చేస్తుంటే స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అక్కడికి వెళ్లి కారు నుంచి సురక్షితంగా మహిళా ను బయటకు తీయించారు. శ్రీకాళహస్తి ఆలయానికి దర్శనానికి రాయచోటి నుంచి ఓ కుటుంబం కారులో విచ్చేశారు. జల వినాయక ప్రాంతంలో కారు పార్కింగ్ లో కారు నిలిపి అందులో ఓ మహిళను ఉంచేసి దర్శనానికి వెళ్లిపోయారు. అయితే ఆ కారు డోర్ లాక్ అయిపోవడంతో కారు లోపల ఉండిపోయిన మహిళకు గాలి లేకుండా ఊపిరి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కారు లోపల మహిళ ఊపిరాడక విలవిల లాడుతూ ఆర్తనాదాలు చేస్తుండగా, అక్కడ ఉన్న భక్తులు గమనించి రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. అక్కడికి సమీపంలో టాయిలెట్ నిర్మాణాలు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సమాచారం అందుకొని వెంటనే కారు వద్దకు వెళ్లారు. ఏమాత్రం ఆలస్యం చేసినా కారు లోపల ఉన్న మహిళ ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉండడం గుర్తించారు. అయితే కారు అద్దాలు పగలకొట్టడానికి కారు కు చెందిన ఓ మహిళ అక్కడికి చేరుకున్న అద్దం పగలగొట్టడానికి వెనకాడింది. కారు అద్దంను అత్యవసరంగా పగలగొట్టి మహిళను బయటకు తీయకపోతే ప్రాణాలు పోతాయని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మందలించి మహిళలను రక్షించే విధంగా చేశారు. కారు అద్దం పగలగొట్టుగానే ఒకసారిగా ఊపిరి పీల్చుకుని ప్రాణాలతో బయటపడిన ఆ మహిళ కొద్దిసేపు పాటు బాహ్యప్రపంచం తెలియని పరిస్థితి తో ఏర్పడగా,స్థానికులు మంచినీరు ఇచ్చి సేద తీర్చారు. పార్కింగ్ లో కార్లు పెట్టి దర్శనానికి వెళ్లేవారు కారులో ఉన్నవారికి ఇబ్బందులు లేకుండా తగి జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే ప్రాణాలకే ముప్పు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలని పార్కింగ్ పర్యవేక్షకులకు సూచించారు
Admin
Famous TV