Saturday, 12 September 2026 02:00:36 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

"జగనన్న ఆణిముత్యాలు" పేరిట ప్రోత్సాహకాలు

అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

Date : 15 June 2023 05:58 PM Views : 775

Famous TV - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి, "జగనన్న ఆణిముత్యాలు" పేరిట ప్రోత్సాహకాలు అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధమ ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన మంత్రి కాకాణి. మంత్రి కాకాణి మాట్లాడుతూ.. 2006 వ సంవత్సరంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతులు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. విద్యపై పెట్టే ప్రతి రూపాయి భావి తరాల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడిగా భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు అవసరమైన వస్తువులను అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పెద్ద పీట వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న నాడు- నేడు పథకాన్ని దేశం మొత్తం మీద ఆచరించేందుకు సిద్ధపడుతుంది. పిల్లలు చదువుతో పాటు విలువలను కూడా అలవర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు, కార్పోరేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు ధీటుగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. విద్యార్థులు స్వతహాగా స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. విద్యార్థులందరూ తమ తల్లితండ్రులు గర్వపడేలా ఉత్తమ స్థాయికి చేరుకోవాలి. తల్లితండ్రులు విద్యార్థుల ఆసక్తిని తెలుసుకొని, ప్రోత్సహించాలి. విద్యార్థులందరూ బాగా చదివి, సర్వేపల్లి నియోజకవర్గానికి మంచి పేరు వచ్చేలా ఎదగాలి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :