Saturday, 13 June 2026 12:24:39 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

బలహీనవర్గాల మహిళలకు రక్షణ చట్టం తేవాలి

Date : 25 June 2025 08:38 PM Views : 613

Famous TV - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : ఫేమస్ టీవి న్యూస్: జాతీయ బిసి బహుజన ఫ్రంటు అధ్యక్షులు తాటికొండ నరసింహారావు బడుగు బలహీన వర్గాల మహిళలపై ఆధునిక యుగంలో కూడా దాడులు హత్యలు అత్యాచారయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఇవన్నీటిని అరికట్టాలి అంటే కచ్చితంగా బడుగు బలహీన వర్గాల మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని జాతీయ బి సి బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ని కలిసి వినతిపత్రం అందజేయడమైనది. ఈ సందర్భంగా తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ కొంతకాలంగాగత ప్రభుత్వం లొ బడుగు బలహీన వర్గాల మహిళలపై దాడులు పెరిగాయని అసమానతలు వివక్షతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని బడుగు వర్గాల మహిళలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. 33% గా ఉన్నటువంటి మహిళలు రాజకీయంగా సామాజికంగా ఎంతో వెనుకబాటు తనానికి గురవుతున్నారని నామినేటెడ్ పదవుల్లో సైతం బలహీన వర్గాల మహిళలకు ప్రాతినిత్యం కల్పించాలని నరసింహారావు కోరారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందిస్తూ బలహీనవర్గాల మహిళలకు ప్రాతినిత్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సిఫార్సు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో తన్నీరు సాంబయ్య వి విజయలక్ష్మి వున్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :