Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వాహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో పిడుగులు, ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.గతకొద్ది రోజులుగా ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండవేడిమి, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైనే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావారణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమ బీహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి కొనసాగుతోందని వాతావారణశాఖ స్పష్టం చేసింది.
Admin
Famous TV