Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి బాలోత్సవం 2వ పిల్లలపండుగ డిశంబర్ 16,17 తేదీలలో తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ నందు 29 రకాల పోటీలు LKG నుండి 10 వ తరగతి 4 విభాగాలుగా అకడమిక్ ,కల్చురల్ ,హస్తకళలు,క్రీడా పోటీలు జరుగుతాయని తెలిపారు.ఈ సందర్బంగా జరిగిన పత్రికావిలేఖరుల సమావేశంలో బాలోత్సవం బ్రోచర్ ను బాలోత్సవం గౌరవాధ్యక్షులు టెంకాయల దామోదరం ఆవిష్కరించి పై విషయాలు తెలియచేసారు.. *తిరుపతి బాలోత్సవం ప్రదానంగా పాఠశాల స్థాయి పిల్లల్లో సామాజికస్పృహ,దేశభక్తి, సమిష్టితత్వం, శాస్త్రీయఆలోచనల్ని పెంచడం,మూఢనమ్మకాలకు దూరంగా,ఒత్తిడి చదువులనుండి బయటపడేలా అటు పిల్లల్లోనూ,తల్లితండ్రుల్లోనూ అవగాహన కల్పించాలనే ఆశయంతో ఏర్పాటయిందని వ్యవస్థాపకులు మల్లారపు నాగార్జున తెలిపారు. *ఈ రెండు రోజుల పిల్లల పండుగ కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ,ప్రయివేట్,టీటీడీ,మున్సిపల్ స్కూల్స్ నుండి పెద్దఎత్తున పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించి వారి మానసికవికాసానికి బాటలు వేయాలని బాలోత్సవం అధ్యక్షులు నడ్డినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి గురునాధం,నాయకులు రెడ్డెప్ప,తహసున్నీసా, మునిలక్ష్మి,సుజాత, చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలాజి చౌదరి, మోహన్ నాయుడు పాల్గొన్నారు.
Admin
Famous TV